యోబు 18
18
యోబుకు బిల్దదు జవాబు
1అప్పుడు షూహీ దేశస్తుడైన బిల్దదు యోబుకు ఇలా జవాబు చెప్పాడు:
2“యోబూ! ఈ మాటలన్నీ ఎప్పుడు చాలిస్తావు?
నీవు మౌనంగా ఉండి వినాలి. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు
3మేము పశువుల్లా బుద్ధిహీనులం అని నీవు ఎందుకు తలస్తావు?
4యోబూ! నీ కోపంతో నీకు నీవే హాని చేసుకొంటున్నావు.
కేవలం నీ కోసం మనుష్యులు ఈ భూమిని విడిచిపోవాలా?
కేవలం నిన్ను తృప్తి పరచటం కోసం దేవుడు పర్వతాలను కదిపిస్తాడని నీవు తలస్తున్నావా?
5“అవును నిజమే, దుర్మార్గుని దీపం ఆరిపోతుంది.
అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది.
6అతని ఇంటిలోని వెలుగు చీకటి అవుతుంది.
అతని ప్రక్కగా ఉన్న దీపం ఆరిపోతుంది.
7ఆ మనిషి అడుగులు మరల గట్టిగా, వేగంగా ఉండవు. కానీ అతడు నిధానంగా నడుస్తాడు, బలహీనంగా ఉంటాడు.
అతని స్వంత దుర్మార్గపు ఆలోచనలే అతడు పడిపోయేట్టు చేస్తాయి.
8అతని స్వంత పాదాలే అతనిని వలలో పడదోస్తాయి.
అతడు బోనులోనికి నడచి, అందులో చిక్కుకొంటాడు.
9ఒక బోను అతని మడిమెను పట్టేస్తుంది.
ఒక బోను అతన్ని గట్టిగా బంధిస్తుంది.
10అతని కోసం నేలమీద ఒక తాడు దాచబడి ఉంటుంది.
అతని తోవలో ఒక బోను సిద్ధంగా ఉంది.
11అతని చుట్టూరా భయం పొంచి ఉంది.
అతడు వేసే ప్రతి అడుగు వెనుక భయం ఉంటుంది.
12చెడ్డ కష్టాలు అతని కోసం ఆకలితో వున్నాయి.
అతడు పడిపోయినప్పుడు పతనం, నాశనం అతని కోసం సిద్ధంగా ఉన్నాయి.
13భయంకర రోగం అతని చర్మంలో కొన్ని భాగాలను తినివేస్తుంది.
అది అతని చేతులను, కాళ్లను కుళ్లిపోచేస్తుంది.
14దుర్మార్గుడు క్షేమంగా ఉన్న తన ఇంటిలో నుండి తీసుకొని పోబడతాడు.
భయాన రాజును ఎదుర్కొనేందుకు అతడు నడిపించబడతాడు.
15అతనికి తన ఇంటిలో ఏమీ విడిచిపెట్టబడదు.
ఎందుకంటే అతని ఇంటినిండా, మండుతున్న గంధకం చల్లబడుతుంది.
16క్రింద అతని వేర్లు ఎండిపోతాయి.
పైన అతని కొమ్మలు చస్తాయి.
17భూమి మీద మనుష్యులు అతనిని జ్ఞాపకం చేసుకోరు.
ఏ వ్యక్తికూడ అతన్ని ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోడు.
18మనుష్యులు అతనిని వెలుతురు నుండి నెట్టివేస్తారు.
అతడు చీకటిలోనికి శిక్షించబడతాడు.
వారు అతన్నిలోకంలో నుండి తరిమివేస్తారు.
19అతనికి పిల్లలు లేక మనుమలు ఎవ్వరూ ఉండరు.
అతని కుమారుల నుండి వారసులు ఉండరు.
అతనియింట యింకా సజీవంగా ఉండే మనుష్యులు ఎవ్వరూ ఉండరు.
20దుర్మార్గునికి సంభవించిన దానిని గూర్చి విన్నప్పుడు పడమట ఉన్న ప్రజలు అదిరిపోతారు.
తూర్పున ఉన్న ప్రజలు భయంతో మెత్తబడి పోతారు.
21ఇది నిజం, దుర్మార్గునికి, అతని ఇంటికి ఇలాగే జరుగుతుంది.
దేవుని గూర్చి లక్ష్యపెట్టని వానికి ఇలాగే జరుగుతుంది!”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 18: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International

: