కీర్తనల గ్రంథము 36
36
సంగీత నాయకునికి: యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.
1“నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు
అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
2ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు.
ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు.
కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
3అతని మాటలు కేవలం పనికిమాలిన అబద్ధాలే.
అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
4రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు.
అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు.
ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.
5యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
6యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
7ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
8యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
9యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
11యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.
దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.
12వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము.
“ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు.
వారు చితుకగొట్టబడ్డారు.
వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనల గ్రంథము 36: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International

: