1 థెస్సలొనీకయులకు 1

1
1తండ్రియైన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి,
పౌలు, సిల్వాను, తిమోతి అనే మేము వ్రాయునది:
మీకు కృపా సమాధానములు కలుగును గాక.
థెస్సలొనీకయుల విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతలు
2మేము ప్రార్థించిన ప్రతిసారి మీ అందరి గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. 3దేవునిపై మీకున్న విశ్వాసంతో చేసిన కార్యాలు, ప్రేమ చేత ప్రేరేపించబడిన మీ ప్రయాసం, మన ప్రభువైన యేసుక్రీస్తులో మీకున్న నిరీక్షణ వలన మీరు చూపుతున్న ఓర్పును మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము.
4దేవుని ప్రేమను పొందిన సహోదరీ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఎన్నుకున్నాడనే సంగతి మాకు తెలుసు. 5ఎందుకంటే, మేము మీకు సువార్తను కేవలం సాధారణ మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో బలమైన విశ్వాసంతో ప్రకటించాము. మీ గురించి మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు. 6మీరు తీవ్రమైన శ్రమల మధ్యలో పరిశుద్ధాత్మలోని సంతోషంతో వాక్యాన్ని స్వీకరించి, మమ్మల్ని మరియు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. 7కనుక మాసిదోనియ అకయ ప్రాంతాల్లో వున్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు. 8అందుకని మీ వలన ప్రభువును గురించిన వాక్యం కేవలం మాసిదోనియ అకయ ప్రాంతాల్లో మారుమ్రోగడమే కాకుండా మీలో దేవునిపై ఉన్న విశ్వాసాన్ని గురించి ప్రతిచోట తెలిసింది. కనుక దాని గురించి మేము చెప్పవలసిన అవసరం లేదు, 9ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎలాంటిదో వారే సాక్ష్యమిస్తున్నారు. సజీవుడైన నిజమైన దేవుణ్ని సేవించడానికి మీరు విగ్రహాలను విడిచిపెట్టి ఎలా దేవుని వైపుకు తిరిగారో, 10మరణం నుండి ఆయన లేపిన, రాబోయే ఉగ్రత నుండి మనల్ని కాపాడబోవుచున్న, పరలోకం నుండి రాబోతున్న ఆయన కుమారుడైన యేసు కొరకు మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో వారే చెప్తున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 థెస్సలొనీకయులకు 1: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి