36
ఏశావు వారసులు
1ఇది ఏశావు అనగా ఎదోము కుటుంబ వంశావళి:
2కనాను స్త్రీలలో నుండి ఏశావు తన భార్యలుగా చేసుకున్న వారు: హిత్తీయుడైన ఎలోను కుమార్తెయైన ఆదా, హివ్వీయుడైన సిబ్యోను మనవరాలు, అనా కుమార్తెయైన ఒహోలీబామా, 3అలాగే నెబాయోతు సోదరి, ఇష్మాయేలు కుమార్తెయైన బాశెమతు.
4ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది. 5ఒహోలీబామా యూషు, యాలాము, కోరహులను కన్నది. వీరంత కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కుమారులు.
6ఏశావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారందరిని, పశువులను, అన్ని జంతువులను, కనానులో సంపాదించుకున్న వస్తువులన్నిటిని తీసుకుని తన తమ్ముడికి దూరంగా ఉన్న దేశానికి వెళ్లాడు. 7వారి ఆస్తులు వారు కలిసి ఉండలేనంత గొప్పగా ఉన్నాయి; వారికున్న పశువులను బట్టి వారున్న స్థలం వారికి సరిపోలేదు. 8కాబట్టి ఏశావు అనగా ఎదోము శేయీరు కొండ సీమలో స్థిరపడ్డాడు.
9శేయీరు కొండ సీమలో స్థిరపడిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి:
10ఏశావు కుమారులు:
ఏశావు భార్య ఆదా కుమారుడైన ఎలీఫజు, ఏశావు భార్య బాశెమతు కుమారుడైన రెయూయేలు.
11ఎలీఫజు కుమారులు:
తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు. 12ఏశావు కుమారుడైన ఎలీఫజుకు తిమ్నా అనే ఉంపుడుగత్తె కూడా ఉంది. ఆమె అమాలేకును కన్నది. వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.
13రెయూయేలు కుమారులు:
నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు.
14ఏశావు భార్య అనా కుమార్తెయైన సిబ్యోను మనవరాలైన ఒహోలీబామా ద్వారా కలిగిన ఏశావు కుమారులు:
యూషు, యాలాము, కోరహు.
15ఏశావు వారసులలో నాయకులైన వారు వీరు:
ఏశావు మొదటి కుమారుడైన ఎలీఫజు కుమారులు:
నాయకులైన తేమాను, సెఫో, కనజు, ఓమారు, 16కోరహు,#36:16 కోరహు కొ.ప్ర.లలో ఈ పేరు లేదు గాతాము, అమాలేకు. వీరు ఎదోములో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.
17ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు:
నాయకులైన నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఎదోములో రెయూయేలు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు.
18ఏశావు భార్య ఒహోలీబామా యొక్క కుమారులు:
నాయకులైన యూషు, యాలాము, కోరహు. వీరు అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామా నుండి వచ్చిన నాయకులు.
19వీరు ఏశావు అనగా ఎదోము కుమారులు, వీరు వారి నాయకులుగా ఉన్నవారు.
20ఆ ప్రాంతంలో నివసిస్తున్న హోరీయుడైన శేయీరు కుమారులు:
లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, 21దిషోను, ఏసెరు, దిషాను. ఎదోములో ఉన్న శేయీరు కుమారులైన వీరు హోరీయుల నాయకులు.
22లోతాను కుమారులు:
హోరీ, హోమాము.#36:22 హెబ్రీ హేమాము, మరో రూపం హోమాము (చూడండి 1 దిన 1:39) లోతాను సోదరి తిమ్నా.
23శోబాలు కుమారులు:
అల్వాను, మనహతు, ఏబాలు, షెఫో, ఓనాము.
24సిబ్యోను కుమారులు:
అయ్యా, అనా. ఈ అనా తన తండ్రి గాడిదలను మేపుతూ ఉన్నప్పుడు అరణ్యంలో నీటి ఊటలను కనుగొన్నాడు.
25అనా సంతానం:
కుమారుడైన దిషోను, కుమార్తెయైన ఒహోలీబామా.
26దిషోను#36:26 హెబ్రీ దిషాను, దిషోను యొక్క మరో రూపం కుమారులు:
హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
27ఏసెరు కుమారులు:
బిల్హాను, జవాను, ఆకాను.
28దిషాను కుమారులు:
ఊజు, అరాను.
29వీరు హోరీయుల నాయకులు:
లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, 30దిషోను ఏసెరు దిషాను.
శేయీరులో వంశావళి ప్రకారం, వీరు హోరీయుల నాయకులు.
ఎదోము పాలకులు
31ఇశ్రాయేలు రాజులెవరు పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు:
32బెయోరు కుమారుడైన బేల ఎదోముకు రాజయ్యాడు. అతని పట్టణానికి దిన్హాబా అని పేరు పెట్టబడింది.
33బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు, బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు.
34యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు.
35హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది.
36హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు.
37శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు.
38షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు.
39అక్బోరు కుమారుడైన బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు#36:39 చాలా ప్రతులలో హదరు అలాగే 1 దిన 1:50 లో కూడా చూడాలి. అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు, అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె.
40వారి వారి వంశాల ప్రకారం వారి వారి ప్రాంతాల ప్రకారం ఇవి ఏశావు వారసుల నాయకులు పేర్లు:
తిమ్నా, అల్వా, యతేతు,
41ఒహోలీబామా, ఏలహు, పీనోను,
42కనజు, తేమాను, మిబ్సారు,
43మగ్దీయేలు, ఈరాము.
వారు ఆక్రమించిన దేశంలో వారి వారి స్థావరాల ప్రకారం, వీరు ఎదోము నాయకులు.
ఇది ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి.