లూకా 6:27-36

లూకా 6:27-36 TCV

“అయితే వింటున్న మీతో నేను చెప్పేది ఏంటంటే: మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థించండి. ఒకడు నిన్ను ఒక చెంప మీద కొడితే, వానికి నీ మరో చెంపను కూడ చూపించు. ఒకవేళ ఒకడు నీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వానికి నీ అంగీని ఇవ్వకుండా వెనుకకు తీసుకోవద్దు. నిన్ను అడిగే ప్రతివానికి ఇవ్వు, మరియు ఒకవేళ ఎవరైన నీకు చెందిన దానిని తీసుకుంటే, దాన్ని మళ్ళీ అడగవద్దు. ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి. “ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు కలిగే గొప్పేమిటి? పాపులు కూడా తమను ప్రేమించేవారినే ప్రేమిస్తారు. మరియు ఒకవేళ మీరు మీకు మేలు చేసే వారికే మేలు చేస్తే, మీకేమి లాభం? పాపులు కూడ అలాగే చేస్తారు. మీకు తిరిగి ఇవ్వగలిగిన వారికే మీరు ఇస్తే మీకేమి లాభం? మీరు కూడా తాము ఇచ్చింది తమకు పూర్తిగా తిరిగి వస్తుందని పాపులకే ఇస్తారు. మీరైతే మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, తిరిగి ఏమి ఆశించకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, మీరు సర్వోన్నతుని పిల్లలుగా ఉంటారు, ఎందుకంటే ఆయన కృతజ్ఞతలేని వారికి మరియు దుష్టులకు దయ చూపించేవాడు. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు, మీరు కూడ కనికరం గలవారై ఉండండి.