అయితే, ఏవైతే నాకు లాభదాయకంగా ఉన్నాయో, నేను ఇప్పుడు వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా భావించాను. నిశ్చయంగా నా ప్రభువైన క్రీస్తు యేసును తెలుసుకోవడం విలువైనది కనుక నేను ప్రతిదీ నష్టంగా భావిస్తున్నాను. నేను క్రీస్తును సంపాదించుకోవడానికి సమస్తాన్ని వ్యర్థంగా భావిస్తున్నాను. క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్ని బట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని, నేను క్రీస్తును తెలుసుకోవాలని కోరుతున్నాను, అవును, ఆయన పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలని, ఆయన శ్రమల్లో పాల్పంచుకోవడం, ఆయన మరణంలో ఆయనలా కావడం, అలా, ఏదో ఒక విధంగా, మృతుల్లో నుండి పునరుత్థానం పొందడం.
Read ఫిలిప్పీయులకు 3
వినండి ఫిలిప్పీయులకు 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఫిలిప్పీయులకు 3:7-11
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు