కీర్తనలు 111

111
కీర్తన 111#111 ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి.
1యెహోవాను స్తుతించండి.#111:1 హెబ్రీలో హల్లెలూయా
యథార్థవంతుల సభలో సమాజంలో
నేను హృదయమంతటితో యెహోవాను స్తుతిస్తాను.
2యెహోవా కార్యాలు గొప్పవి;
వాటిలో ఆనందించే వారందరు వాటి గురించి ధ్యానిస్తారు.
3ఆయన క్రియలు కీర్తనీయమైనవి ప్రభావవంతమైనవి,
ఆయన నీతి నిరంతరం ఉంటుంది.
4మనుష్యులకు జ్ఞాపకముండేటట్లు ఆయన అద్భుతాలు చేస్తారు;
యెహోవా దయామయుడు. కనికరం గలవారు.
5భయభక్తులు గలవారిని పోషిస్తారు.
ఆయన తన నిబంధన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు.
6తన ప్రజలకు ఇతర దేశాలను వారసత్వంగా ఇచ్చి,
తన క్రియలలోని బలప్రభావాలను వారికి వెల్లడించారు.
7ఆయన చేతుల పనులు విశ్వసనీయమైనవి న్యాయమైనవి;
ఆయన కట్టడలు నమ్మదగినవి.
8అవి శాశ్వతంగా స్థాపించబడ్డాయి,
నమ్మకత్వంతో యథార్థతతో అవి చేయబడ్డాయి.
9ఆయన తన ప్రజలకు విమోచన సమకూర్చారు;
ఆయన తన ఒడంబడికను శాశ్వతంగా నియమించారు,
ఆయన నామం పరిశుద్ధమైనది భీకరమైనది.
10యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం;
ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు.
స్తుతి నిత్యం ఆయనకే చెందును.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 111: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి