కీర్తనలు 142

142
కీర్తన 142
దావీదు యొక్క ధ్యానకీర్తన; గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన.
1నేను గొంతెత్తి యెహోవాకు ఆక్రందన చేస్తున్నాను;
దయ కోసం యెహోవాకు కంఠమెత్తి ప్రాధేయపడుతున్నాను.
2ఆయన ఎదుట నా ఫిర్యాదు వెల్లడి చేసుకుంటాను;
నా కష్టాల గురించి ఆయనకు చెప్పుకుంటాను.
3నా ఆత్మ నాలో సొమ్మసిల్లినప్పుడు
మీరే నా నడకను చూస్తారు.
నేను నడచే దారిలో,
శత్రువులు రహస్యంగా ఉచ్చులు ఉంచారు.
4చూడండి, నా కుడివైపు ఎవరు లేరు;
ఎవరు నా గురించి పట్టించుకోరు
నాకు ఆశ్రయం లేదు;
ఒక్కరైన నాపై దయ చూపించరు.
5యెహోవా, మీకు మొరపెట్టుకుంటున్నాను;
“నా ఆశ్రయం మీరే,
సజీవుల దేశంలో నా స్వాస్థ్యం మీరే” అని నేనంటాను.
6నేను చాలా క్రుంగిపోయాను,
నా మొరను ఆలకించండి.
నన్ను వెంటాడే వారి నుండి రక్షించండి,
వారు నాకంటే బలంగా ఉన్నారు.
7నేను మీ నామాన్ని స్తుతించేలా,
చెరసాలలో నుండి నన్ను విడిపించండి.
అప్పుడు మీరు చేసిన ఉపకారం చూసి,
నీతిమంతులు నా చుట్టూరా చేరతారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 142: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి