కీర్తనలు 83

83
కీర్తన 83
ఒక గీతము. ఆసాపు కీర్తన.
1ఓ దేవా! మౌనంగా ఉండకండి;
ఓ దేవా, మమ్మల్ని పెడచెవిని పెట్టకండి,
నిశ్చలంగా ఉండకండి.
2మీ శత్రువులు ఎలా కేకలు వేస్తున్నారో చూడండి,
మిమ్మల్ని ద్వేషించేవారు తలలు పైకెత్తుతున్నారు.
3వారు మీ ప్రజలకు హాని చేయాలని చూస్తున్నారు;
మీరు ఆదరించే వారికి వ్యతిరేకంగా వారు కుట్రలు చేస్తారు.
4“రండి, వారి దేశాన్ని లేకుండ నాశనం చేద్దాం
అప్పుడు ఇశ్రాయేలీయుల పేరు ఇక జ్ఞాపకం ఉండదు” అని వారు అంటున్నారు.
5వారు ఏకమనస్సుతో కుట్ర చేశారు;
వారు మీకు వ్యతిరేకంగా ఒప్పందం చేసుకున్నారు.
6గుడారాల్లో నివసించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు,
మోయాబీయులు, హగ్రీయీలు,
7గెబాలు, అమ్మోను అమాలేకు,
ఫిలిష్తియా, తూరు ప్రజలతో ఒప్పందం చేసుకున్నారు.
8లోతు వారసులను బలోపేతం చేయడానికి
అష్షూరు కూడా వారితో చేరింది. సెలా
9మిద్యానుకు చేసినట్లుగా,
కీషోను నది దగ్గర సీసెరా యాబీనుకు చేసినట్లుగా వారికి చేయండి.
10వారు ఎన్-దోరు దగ్గర నశించారు
నేల మీద పేడలా అయ్యారు.
11ఓరేబుకు జెయేబుకు చేసినట్లు వారి సంస్థానాధిపతులకు
జెబహుకు సల్మున్నాకు వారి యువరాజులందరికి చేయండి.
12వారు, “దేవుని పచ్చికబయళ్లను
స్వాధీనం చేసుకుందాం” అని అన్నారు.
13నా దేవా, వారిని సుడి తిరిగే దుమ్ములా,
గాలి ముందు కొట్టుకుపోయే పొట్టులా చేయండి.
14అగ్ని అడవిని దహించునట్లు
కారుచిచ్చు పర్వతాలను తగలబెట్టినట్లు,
15మీ తుఫానుతో వారిని వెంటాడండి
మీ సుడిగాలితో వారిని భయపెట్టండి.
16వారు మీ నామాన్ని వెదకునట్లుగా,
యెహోవా, సిగ్గుతో వారి ముఖాలు కప్పండి.
17వారు ఎప్పటికీ సిగ్గుపడాలి భయపడాలి;
వారు అవమానంలో నశించెదరు గాక.
18యెహోవా అనే నామం గల మీరు
భూమి మీద అందరిలో మహోన్నతుడవని వారు తెలుసుకోవాలి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 83: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి