కీర్తనలు 92

92
కీర్తన 92
సబ్బాతు దినానికి తగిన కీర్తన. ఒక గీతము.
1యెహోవాను స్తుతించడం మంచిది.
మహోన్నతుడా, మీ నామాన్ని కీర్తించడం మంచిది.
2-3ఉదయకాలం మీ మారని ప్రేమను
రాత్రివేళ మీ నమ్మకత్వాన్ని
పది తంతుల వీణ
సితారా మాధుర్యంతో ప్రకటించడం మంచిది.
4ఎందుకంటే యెహోవా, మీ కార్యముల చేత నాకు సంతోషం కలిగిస్తారు;
మీ చేతులు చేసిన వాటిని బట్టి నేను ఆనంద గానం చేస్తాను.
5యెహోవా, మీ క్రియలు ఎంత గొప్పవి,
మీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి!
6-7దుష్టులు గడ్డిలా మొలకెత్తినా,
కీడుచేసేవారంతా వర్ధిల్లుతున్నా,
వారు శాశ్వతంగా నాశనమవుతారని,
తెలివిలేనివారికి తెలియదు,
మూర్ఖులు గ్రహించరు.
8కాని యెహోవా, మీరు శాశ్వతంగా హెచ్చింపబడి ఉన్నారు.
9యెహోవా, మీ శత్రువులు,
నిజంగా మీ శత్రువులు నశిస్తారు;
కీడుచేసేవారంతా చెదరిపోతారు.
10మీరు నా కొమ్మును#92:10 కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది అడవి ఎద్దులా హెచ్చించారు;
చక్కని నూనెలు నాపై పోయబడ్డాయి.
11నా విరోధుల ఓటమిని నేను కళ్లారా చూశాను;
నా దుష్టుల పూర్తి పరాజయాన్ని నా చెవులారా విన్నాను.
12నీతిమంతులు తాటి చెట్లలా చిగురు పెడతారు,
లెబానోనులో వారు దేవదారు చెట్టులా హుందాగా పెరుగుతారు.
13వారు యెహోవా దేవాలయంలో నాటబడి,
మన దేవుని ఆవరణాల్లో వర్థిల్లుతారు.
14వారు వృద్ధాప్యంలో కూడా సఫలమైన జీవితంలో
సారవంతంగా హాయిగా బ్రతుకుతారు,
15“యెహోవా యథార్థవంతుడు, ఆయన నా కొండ,
ఆయనయందు ఏ దుష్టత్వం లేదు” అని వారు ప్రకటిస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 92: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి