ప్రకటన 10

10
చిన్న గ్రంథపు చుట్ట మరియు దేవదూత
1బలమైన మరొక దేవదూత మేఘాన్ని ధరించుకొని, తన తల మీద వానవిల్లు కలిగి పరలోకం నుండి దిగి రావడం నేను చూసాను. ఆ దేవదూత ముఖం సూర్యునిలా, కాళ్ళు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి. 2అతడు తెరిచి ఉన్న ఒక చిన్న గ్రంథపు చుట్టను తన చేతిలో పట్టుకొని తన కుడికాలు సముద్రం మీద, ఎడమకాలు భూమి మీద పెట్టి, 3ఒక సింహపు గర్జన వంటి పెద్ద స్వరంతో కేక వేసాడు. అతడు కేక వేసినప్పుడు ఏడు ఉరుములు తిరిగి గర్జించాయి. 4ఆ ఏడు ఉరుముల గర్జనలను విన్న నేను వాటి గురించి వ్రాస్తు ఉన్నప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఈ గర్జనలను గురించి వ్రాయకు, వాటిని గుప్తంగా ఉంచాలి” అని చెప్పడం విన్నాను.
5అప్పుడు సముద్రం మీద, భూమి మీద నిలబడి ఉన్నట్లు నేను చూసిన ఆ దేవదూత తన కుడి చేతిని ఆకాశం వైపు ఎత్తాడు. 6ఆ తరువాత అతడు ఎల్లకాలం జీవిస్తూ పరలోకాన్ని దానిలో ఉన్న వాటన్నిటిని, భూమిని దానిలో ఉన్న వాటన్నిటిని, సముద్రాన్ని దానిలో ఉన్న వాటన్నిటిని సృజించినవాని తోడు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, “ఇక ఏ ఆలస్యం ఉండదు! 7కాని ఏడవ దూత తన బూరను ఊదబోయే సమయంలో, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ముందే తెలిపిన విధంగా దేవుని మర్మం నెరవేరుతుంది” అని చెప్పాడు.
8అప్పడు పరలోకం నుండి నాతో మాట్లాడిన స్వరం మళ్లీ నాతో, “వెళ్ళు, సముద్రం మీద భూమి మీద నిలబడి ఉన్న దేవదూత చేతిలో తెరిచి ఉన్న ఆ చిన్న గ్రంథపు చుట్టను తీసుకో” అని చెప్పడం విన్నాను.
9కనుక నేను ఆ దేవదూత దగ్గరకు వెళ్ళి ఆ చిన్న గ్రంథపు చుట్టను నాకు ఇవ్వుమని అడిగాను. అప్పుడు అతడు నాతో, “దీనిని తీసుకొని తిను, ఇది నీ కడుపుకు చేదుగా ఉంటుంది కాని నీ నోటికి తేనెలా తియ్యగా ఉంటుంది”#10:9 యెహె 3:3 అని చెప్పాడు. 10కనుక నేను ఆ చిన్న గ్రంథపు చుట్టను ఆ దేవదూత చేతిలో నుండి తీసుకొని తిన్నప్పుడు అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కాని నేను దాన్ని తిన్న తరువాత నా కడుపులో చేదుగా మారింది. 11అప్పుడు ఆయన నాతో, “నీవు అనేకమంది ప్రజల గురించి, దేశాల గురించి, వివిధ భాషలు మాట్లాడే ప్రజల గురించి, రాజుల గురించి మళ్ళీ ప్రవచించాలి” అని చెప్పాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ప్రకటన 10: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి