ప్రకటన 15

15
ఏడుగురు దేవదూతలు, చివరి ఏడు తెగుళ్ళు
1నేను పరలోకంలో మరొక గొప్ప అద్బుతమైన సూచన చూసాను: ఏడుగురు దేవదూతలు చివరి ఏడు తెగుళ్ళను పట్టుకొని వస్తున్నారు. అవి చివరివి ఎందుకంటే ఈ తెగుళ్ళతో దేవుని కోపం తీరిపోతుంది. 2నేను అగ్నితో కలిసి ఉన్న గాజు సముద్రంలాంటి దాన్ని చూసాను. ఆ గాజు సముద్రపు ఒడ్డున ఆ మృగాన్ని, ఆ మృగం యొక్క విగ్రహాన్ని, ఆ మృగం పేరుగల సంఖ్యను ఎదిరిస్తూ జయించినవారు నిలబడి ఉన్నారు. వారు తమకు దేవుడు ఇచ్చిన తంతి వాయిద్యాలను పట్టుకొని ఉన్నారు. 3వారు దేవుని సేవకుడైన మోషే, వధించబడిన గొర్రెపిల్ల యొక్క పాడిన పాట పాడుతూ,
“మా ప్రభువైన సర్వశక్తిగల దేవా!
నీవు చేసిన క్రియలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి!
సకల రాజ్యాలకు#15:3 రాజ్యాలకు కొన్ని ప్రతులలో యుగములకు రాజా!
నీ మార్గాలు యదార్థంగా న్యాయంగా ఉన్నాయి!
4ఓ ప్రభువా! నీవు ఒక్కడివే పరిశుద్ధుడవు,
కనుక నీకు భయపడని వారు ఎవరు?
నీ పేరును ఘనపరచకుండా ఎవరు ఉండగలరు?
నీ నీతి క్రియలు నిరూపించబడి ఉన్నాయి,
కనుక భూజనులందరు
నీ యెదుటకు వచ్చి ఆరాధిస్తారు,”#15:4 కీర్తన 111:2,3; ద్వితీ 32:4; యిర్మీయా 10:7; కీర్తన 86:9; కీర్తన 98:2
అని దేవుని స్తుతించారు.
5దీని తరువాత నేను చూస్తూ వుండగా, పరలోక దేవాలయం అనగా సాక్ష్యపు గుడారం తెరవబడింది. 6ఆ పరలోక దేవాలయం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళు తీసుకువచ్చారు. వారు ప్రకాశిస్తున్న తెల్లని వస్త్రాలను ధరించి తమ రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకొని ఉన్నారు. 7అప్పుడు నాలుగు ప్రాణులలోని ఒక ప్రాణి, ఎల్లప్పుడు నిరంతరం జీవించే దేవుని ఉగ్రతతో నింపబడిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవదూతలకు ఇచ్చాడు. 8అప్పుడు ఆ దేవాలయమంతా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చే పొగతో నింపబడినందున ఆ ఏడుగురు దేవదూతలు ఆ ఏడు తెగుళ్ళను కుమ్మరించే వరకు ఆ దేవాలయంలోనికి ఎవరు ప్రవేశించలేకపోయారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ప్రకటన 15: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి