1 దినవృత్తాంతములు 25
25
సంగీతకారులు
1దావీదు, తన సైన్యాధిపతులతో కలిసి ఆసాపు, హేమాను, యెదూతూను అనేవారి కుమారులలో కొందరిని సితారాలు, వీణలు, తాళాలు వాయిస్తూ ప్రవచించే పరిచర్య కోసం నియమించారు. ఈ సేవకు నియమించబడినవారి జాబితా ఇది:
2ఆసాపు కుమారుల నుండి:
జక్కూరు, యోసేపు, నెతన్యా, అషరేలా. వీరు రాజు పర్యవేక్షణలో ప్రవచిస్తూ, ఆసాపు పర్యవేక్షణలో ఉన్న ఆసాపు కుమారులు.
3యెదూతూను కుమారుల నుండి:
గెదల్యా, జెరీ, యెషయా, షిమ్యా, హషబ్యా, మత్తిత్యా, మొత్తం ఆరుగురు, వీరు స్తుతి పాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి వీణ వాయిస్తూ ప్రవచించే తమ తండ్రియైన యెదూతూను పర్యవేక్షణలో ఉన్నవారు.
4హేమాను కుమారుల నుండి:
బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు; హనన్యా, హనానీ, ఎలీయాతా, గిద్దల్తీ, రోమమ్తీ-యెజెరు; యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు. 5(వీరంతా రాజుకు దీర్ఘదర్శిగా ఉన్న హేమాను కుమారులు. తన వాగ్దానాల ప్రకారం హేమానును గొప్ప చేయడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కుమారులను, ముగ్గురు కుమార్తెలను ఇచ్చారు.)
6వీరందరు తమ తండ్రుల పర్యవేక్షణలో ఉండి, యెహోవా మందిరంలో తాళాలు, వీణలు, సితారాలు వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుని మందిరం దగ్గర సేవ చేసేవారు.
ఆసాపు, యెదూతూను, హేమానులు రాజు పర్యవేక్షణలో ఉండేవారు. 7యెహోవాకు పాటలు పాడడంలో నైపుణ్యం ఉన్న వీరి బంధువులందరితో కలిపి వీరి సంఖ్య 288. 8చిన్నా, పెద్దా, గురువు శిష్యుడు అనే భేదం లేకుండా చీట్లు వేసి విధులు నిర్ణయించుకున్నారు.
9మొదటి చీటి ఆసాపు వంశంలో ఉన్న యోసేపు పేరిట వచ్చింది,
రెండవది గెదల్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు#25:9 కొ.ప్ర.లలో ఇతని కుమారులు బంధువులు అని లేదు పన్నెండుమంది.
10మూడవది జక్కూరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
11నాలుగవది యిజ్రీ#25:11 జెరీ మరొక పేరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
12అయిదవది నెతన్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
13ఆరవది బక్కీయాహు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
14ఏడవది యెషర్యేలా#25:14 అషర్యేలా మరొక పేరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
15ఎనిమిదవది యెషయా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
16తొమ్మిదవది మత్తన్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
17పదవది షిమీ పేరట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
18పదకొండవది అజరేలు#25:18 ఉజ్జీయేలు అజరేలు యొక్క మరొక పేరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
19పన్నెండవది హషబ్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
20పదమూడవది షూబాయేలు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
21పద్నాలుగవది మత్తిత్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
22పదిహేనవది యెరేమోతు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
23పదహారవది హనన్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
24పదిహేడవది యొష్బెకాషా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
25పద్దెనిమిదవది హనానీ పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
26పందొమ్మిదవది మల్లోతి పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
27ఇరవయ్యవది ఎలీయాతా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
28ఇరవై ఒకటవది హోతీరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
29ఇరవై రెండవది గిద్దల్తీ పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
30ఇరవై మూడవది మహజీయోతు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
31ఇరవై నాలుగవది రోమమ్తీ-యెజెరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 దినవృత్తాంతములు 25: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

:
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)