1 సమూయేలు 21
21
నోబులో దావీదు
1దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చాడు. అయితే అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి, “నీతో ఎవరూ లేకుండా నీవు ఒక్కడివే వచ్చావెందుకు?” అని అతన్ని అడిగాడు.
2అందుకు దావీదు యాజకుడైన అహీమెలెకుతో, “రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నిన్ను పంపిన పని గురించి ఎవరికి తెలియకూడదు’ అన్నాడు. నేను నా మనుష్యులతో ఒక చోటికి వెళ్లి అక్కడ ఉండమని చెప్పాను. 3నీ దగ్గర ఏముంది? అయిదు రొట్టెలు గాని మరేమైనా గాని ఉంటే అవి నాకు ఇవ్వు” అన్నాడు.
4ఆ యాజకుడు దావీదుతో, “సాధారణ రొట్టె నా దగ్గర లేదు; నీ మనుష్యులు స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే వారు ఇక్కడ ఉన్న ప్రతిష్ఠిత రొట్టెలు తినవచ్చు” అని చెప్పాడు.
5అందుకు దావీదు, “ఖచ్చితంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు రోజులు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. వారి దేహాలు పవిత్రంగానే ఉన్నాయి. సాధారణ పనిమీద వెళ్లినప్పుడే ఈ మనుష్యులు పవిత్రంగా ఉంటే, ఈ రోజు ఇంకెంత పవిత్రంగా ఉంటారు!” 6యాజకుడు అతనికి వెచ్చని రొట్టెలు వేసే రోజున తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను ఇచ్చాడు, ఎందుకంటే అక్కడ యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప వేరే లేవు.
7ఆ రోజు సౌలు సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో ఉన్నాడు; అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు, అతడు సౌలు యొక్క బలవంతుడైన కాపరి.
8దావీదు అహీమెలెకును, “రాజు అప్పగించిన పని తొందరలో నేను నా కత్తిని ఇతర ఆయుధాలను తీసుకురాలేదు, నీ దగ్గర కత్తి గాని ఈటె గాని ఉందా?” అని అడిగాడు.
9అందుకు యాజకుడు, “ఏలహు లోయలో నీవు చంపిన గొల్యాతు అనే ఫిలిష్తీయుని కత్తి ఇక్కడ ఉంది. అది ఏఫోదు వెనుక బట్టతో చుట్టి ఉంది. అది తప్ప ఇక్కడ మరి ఏ కత్తి లేదు, నీకు కావాలంటే అది తీసుకో” అన్నాడు.
దావీదు, “దానికి సాటియైనది మరొకటి లేదు; అది నాకు ఇవ్వు” అన్నాడు.
గాతు దగ్గర దావీదు
10దావీదు సౌలుకు భయపడి ఆ రోజే బయలుదేరి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరకు వచ్చాడు. 11అయితే ఆకీషు సేవకులు అతనితో, “ఈ దావీదు ఆ దేశపు రాజు కాదా? వారు నాట్యం చేస్తూ పాటలు పాడుతూ,
“ ‘సౌలు వేలమందిని చంపాడు.
దావీదు పదివేలమందిని చంపారని చెప్పింది ఇతని గురించే కదా’?”
అన్నారు.
12దావీదు ఈ మాటలు గుర్తుపెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు. 13కాబట్టి దావీదు వారి ఎదుట తన ప్రవర్తన మార్చుకొని పిచ్చివానిలా నటిస్తూ గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మి తన గడ్డం మీదికి కారనిస్తుండేవాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి చేష్టలు చేస్తుండేవాడు.
14కాబట్టి ఆకీషు రాజు తన సేవకులతో, “అతన్ని చూడండి! అతడు పిచ్చివాడు. అతన్ని నా దగ్గరకు ఎందుకు తీసుకువచ్చారు? 15పిచ్చి చేష్టలు చేసేవానితో నాకేమి పని? నా ఎదుట పిచ్చి చేష్టలు చేయడానికి ఇతన్ని ఎందుకు తీసుకువచ్చారు? ఇలాంటివాడు నా ఇంట్లోకి రావాలా?” అన్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 21: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: