2 రాజులు 17
17
ఇశ్రాయేలు యొక్క చివరి రాజైన హోషేయ
1యూదా రాజైన ఆహాజు పరిపాలనలోని పన్నెండవ సంవత్సరంలో ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు. అతడు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. 2అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అయితే తనకు ముందున్న ఇశ్రాయేలు రాజుల మాదిరిగా కాదు.
3అష్షూరు రాజైన షల్మనేసెరు హోషేయ మీద దాడి చేయడానికి రాగా హోషేయ అతనికి లొంగిపోయి అతనికి పన్ను చెల్లించాడు. 4అయితే హోషేయ కుట్ర చేస్తున్నట్టు అష్షూరు రాజు పసిగట్టాడు, ఎందుకంటే హోషేయ, ఈజిప్టు రాజైన సో#17:4 సో బహుశ సంక్షిప్త రూపం ఒసొర్కోను దగ్గరకు దూతలను పంపి ప్రతి సంవత్సరం అష్షూరు రాజుకు చెల్లించే పన్ను చెల్లించడం మానేశాడు; కాబట్టి షల్మనేసెరు అతన్ని పట్టుకుని చెరసాలలో వేశాడు. 5అప్పుడు అష్షూరు రాజు దేశానంతా ఆక్రమించి, సమరయ మీదికి దండెత్తి దాన్ని మూడేళ్ళ వరకు ముట్టడించాడు. 6హోషేయ పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు సమరయను పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లాడు. హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.
పాపాన్ని బట్టి బందీలుగా ఇశ్రాయేలీయులు
7ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి రాజైన ఫరో బలం నుండి విడిపించి, వారిని బయటకు తీసుకువచ్చిన తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా వారు పాపం చేశారు. వారు ఇతర దేవుళ్ళను పూజిస్తూ, 8తమ ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాల ఆచారాలను, ఇశ్రాయేలు రాజులు ప్రవేశపెట్టిన ఆచారాలను పాటించారు. 9ఇశ్రాయేలీయులు తమ దేవుడు యెహోవాకు వ్యతిరేకంగా, రహస్యంగా చెడు కార్యాలు చేశారు. కావలికోట నుండి కోటగోడలు గల పట్టణం వరకు, తమ పట్టణాల్లో క్షేత్రాలను కట్టుకున్నారు. 10వారు ప్రతీ ఎత్తైన కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద, పవిత్ర రాళ్లను, అషేరా స్తంభాలను నిలబెట్టారు. 11తమ ఎదుట నిలబడకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల ఆచారాల ప్రకారం క్షేత్రాల్లో ధూపం వేశారు. చెడుపనులు చేస్తూ యెహోవాకు కోపం రేపారు. 12యెహోవా వారికి, “మీరు ఇలా చేయకూడదు”#17:12 నిర్గమ 20:4,5 అని చెప్పినప్పటికి వారు విగ్రహాలను సేవించారు. 13యెహోవా ఇశ్రాయేలును, యూదాను తన ప్రవక్తలందరి ద్వారా, దీర్ఘదర్శులందరి ద్వారా, “మీ చెడు మార్గాలను విడిచిపెట్టండి. మీ పూర్వికులకు ఆజ్ఞాపించిన, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన నా ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నా ఆజ్ఞలను, శాసనాలను పాటించండి” అని హెచ్చరించారు.
14అయితే వారు వినలేదు, తమ దేవుడైన యెహోవాపై నమ్మకముంచని తమ పూర్వికుల్లా మొండిగా ఉన్నారు. 15ఆయన శాసనాలను, ఆయన తమ పూర్వికులతో చేసిన నిబంధనను, ఆయన పాటించమని హెచ్చరించిన ధర్మశాస్త్రాన్ని వారు నిరాకరించారు. అయోగ్యమైన విగ్రహాలను అనుసరించి అయోగ్యులయ్యారు. యెహోవా వారికి, “వారు చేసినట్లు మీరు చేయకూడదు” అని చెప్పినప్పటికి తమ చుట్టూ ఉన్న ప్రజల విధానాలను వారు అనుసరించారు.
16తమ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నీ విడిచిపెట్టి, తమ కోసం పోతపోసిన రెండు దూడలను, అషేరా స్తంభాన్ని చేసుకున్నారు. వారు నక్షత్రాలకు నమస్కరించి బయలును సేవించారు. 17తమ కుమారులను, కుమార్తెలను అగ్నిలో బలి ఇచ్చారు. భవిష్యవాణి, సోదె చెప్పించడం చేసి, యెహోవా దృష్టిలో చెడు చేయడానికి తమను తాము అమ్ముకుని ఆయనకు కోపం రేపారు.
18కాబట్టి యెహోవా ఇశ్రాయేలు మీద చాలా కోప్పడి, తన సముఖం నుండి వారిని తొలగించారు. యూదా గోత్రం మాత్రమే మిగిలింది. 19యూదా వారు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించలేదు. ఇశ్రాయేలు ప్రవేశపెట్టిన ఆచారాలను వారు అనుసరించారు. 20కాబట్టి యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరినీ తిరస్కరించారు; ఆయన వారిని బాధకు గురిచేసి, తన సముఖం నుండి వారిని త్రోసివేసే వరకు వారిని దోపిడి మూకలకు అప్పగించారు.
21ఆయన ఇశ్రాయేలును దావీదు రాజవంశం నుండి విడగొట్టినప్పుడు, వారు నెబాతు కుమారుడైన యరొబామును తమ రాజుగా చేసుకున్నారు. వారు యెహోవాను అనుసరించకుండా ఘోరమైన పాపం చేయడానికి యరొబాము కారణమయ్యాడు. 22ఇశ్రాయేలీయులు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే చేస్తూ వచ్చారు. 23చివరికి యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరి ద్వారా హెచ్చరించినట్లు, వారిని తన సముఖం నుండి త్రోసివేశారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తమ స్వదేశం నుండి బందీలుగా అష్షూరుకు వెళ్లారు, ఈనాటికీ వారక్కడ ఉన్నారు.
సమరయ పునరావాసం
24అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెఫర్వయీము నుండి మనుష్యులను తీసుకువచ్చి, సమరయ పట్టణాల్లో ఇశ్రాయేలీయులకు బదులుగా వారిని ఉంచాడు. వారు సమరయను స్వాధీనం చేసుకుని దాని పట్టణాల్లో నివసించారు. 25వారు మొదట అక్కడ నివసించినప్పుడు, వారు యెహోవాకు భయపడలేదు; కాబట్టి ఆయన వారి మధ్యకు సింహాలను పంపించారు, అవి వారిలో కొంతమందిని చంపాయి. 26అష్షూరు రాజుకు, “మీరు తీసుకువచ్చి సమరయ పట్టణాల్లో ఉంచిన ప్రజలకు ఈ దేశం యొక్క దేవుని నియమాలు తెలియవు. ఆయనకు ఏం కావాలో ప్రజలకు తెలియదు కాబట్టి సింహాలు వారిని చంపుతూ ఉన్నాయని వారు అష్షూరు రాజుకు చెప్పారు.”
27అప్పుడు అష్షూరు రాజు, “సమరయ నుండి బందీలుగా తీసుకువచ్చిన యాజకులలో ఒకడిని అక్కడికి వెళ్లి అక్కడ నివసిస్తూ ఆ దేశ దేవుని నియమాలను ఆ ప్రజలకు బోధించడానికి పంపించండి” అని ఆజ్ఞాపించాడు. 28కాబట్టి సమరయ నుండి బందీలుగా వెళ్లిన యాజకులలో ఒకడు బేతేలులో నివసించడానికి వచ్చి, యెహోవాను భయభక్తులతో ఎలా ఆరాధించాలో వారికి బోధించాడు.
29అయినా కొంతమంది ప్రజలు తాము స్థిరపడ్డ అనేక పట్టణాల్లో తమ సొంత దేవుళ్ళను చేసుకుని, ఎత్తైన స్థలాల దగ్గర సమరయ ప్రజలు కట్టుకున్న క్షేత్రాల్లో వాటిని నిలబెట్టారు. 30బబులోనువారు సుక్కోత్-బెనోతు, కూతు వారు నెర్గలును, హమాతు వారు అషీమా విగ్రహాన్ని చేశారు; 31ఆవీయులు నిబ్హజును, తర్తాకును విగ్రహాలుగా చేసుకున్నారు. సెఫర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మెలెకు, అనెమ్మెలెకు అనే సెఫర్వయీము దేవుళ్ళకు అగ్నిలో బలిగా అర్పించారు. 32వారు యెహోవాను ఆరాధించారు కాని ఎత్తైన స్థలాల్లో ఉన్న క్షేత్రాల్లో అన్ని రకాల ప్రజలను యాజకులుగా చేసుకున్నారు. 33వారు యెహోవాను ఆరాధించారు కాని వారు తాము ఏ దేశాల నుండి వచ్చారో, ఆ దేశాల ఆచారాల ప్రకారం తమ దేవుళ్ళను కూడా సేవించారు.
34వారు ఈనాటి వరకు తమ పూర్వాచారాలను పాటిస్తున్నారు. యెహోవా ఇశ్రాయేలు అని పేరుపెట్టబడిన యాకోబు సంతానం ఆయనను ఆరాధించలేదు, ఆయన శాసనాలను, నిబంధనలను, నియమాలను, ఆజ్ఞలను అనుసరించలేదు. 35యెహోవా ఇశ్రాయేలీయులతో నిబంధన చేసినప్పుడు, ఆయన వారికి ఇలా ఆజ్ఞాపించారు: “మీరు ఏ ఇతర దేవుళ్ళను పూజించకూడదు; వాటికి మొక్కకూడదు, సేవించకూడదు వాటికి బలులు అర్పించకూడదు. 36ఎవరైతే మిమ్మల్ని ఈజిప్టు దేశం నుండి గొప్ప బలప్రభావాలతో, చాచిన హస్తంతో బయటకు తెచ్చారో, ఆ యెహోవాను మీరు ఆరాధించాలి. ఆయనకు మొక్కి, ఆయనకు బలులు అర్పించాలి. 37ఆయన మీకోసం వ్రాసిన శాసనాలను, నిబంధనలను, నియమాలను, ఆజ్ఞలను పాటించడంలో జాగ్రత వహించాలి. ఇతర దేవుళ్ళను పూజించకూడదు. 38నేను మీతో చేసిన నిబంధన మరచిపోవద్దు, ఇతర దేవుళ్ళను పూజించకూడదు. 39కాని మీ దేవుడైన యెహోవాను భయభక్తులతో ఆరాధించాలి; ఆయనే మీ శత్రువులందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తారు.”
40అయితే వారు ఆయన మాట వినకుండా, తమ పూర్వాచారాలను అనుసరించారు. 41ఈ ప్రజలు యెహోవాను ఆరాధిస్తున్ననూ, విగ్రహాలను కూడా సేవించారు. ఈనాటికీ వారి పిల్లలు, పిల్లల పిల్లలు వారి పూర్వికులు చేసినట్టే చేస్తున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 17: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: