కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు. ఎందుకనగా, ఆయనలోనే సమస్తం సృష్టించబడ్డాయి, అనగా: ఆకాశంలో ఉన్నవి, భూమిపై ఉన్నవి, కంటికి కనబడేవి కనబడనివి, సింహాసనాలైనా లేదా ప్రభుత్వాలైనా లేదా పాలకులైనా లేదా అధికారులైనా, సమస్తం ఆయన ద్వారానే ఆయన కొరకే సృష్టించబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము. సంఘమనే శరీరానికి ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో సర్వాధికారం కలిగి ఉండడానికి ఆయనే ఆరంభం, మృతులలో నుండి లేచుటలో ప్రథముడయ్యారు. ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం. ఆయన ద్వారా సమస్తాన్ని అనగా, భూమిపై ఉన్న లేదా పరలోకంలో ఉన్న, అన్నిటిని, క్రీస్తు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీపరచి, క్రీస్తు ద్వారా తనలో సమాధానపరచుకోవడం తండ్రికి ఇష్టమైనది.
చదువండి కొలొస్సీ పత్రిక 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కొలొస్సీ పత్రిక 1:15-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు