ప్రసంగి 1:13-18

ప్రసంగి 1:13-18 OTSA

ఆకాశం క్రింద జరుగుతున్నదంతా అధ్యయనం చేయడానికి జ్ఞానంతో పరిశోధించడానికి దానిపై మనస్సు పెట్టాను. దేవుడు మనుష్యులపై ఎంతో అధికమైన భారం పెట్టారు! సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిని నేను చూశాను; అవన్నీ అర్థరహితమే, అది గాలి కోసం ప్రయాసపడడమే. వంకరగా ఉన్నవాటిని సరి చేయలేము; లేనివాటిని లెక్కపెట్టలేము. “చూడు, యెరూషలేములో నాకన్నా ముందు పాలించిన రాజులందరికంటే నేను గొప్పజ్ఞానిని; ఎంతో జ్ఞానాన్ని తెలివిని సంపాదించాను” అని నాలో నేను అనుకున్నాను. ఏది జ్ఞానమో, ఏది వెర్రితనమో ఏది అవివేకమో గ్రహించాలని ప్రయత్నించాను. కాని అది కూడా, గాలి కోసం ప్రయాసపడడమే అని తెలుసుకున్నాను. జ్ఞానం ఎక్కువవుతూ ఉంటే విచారం కూడా ఎక్కువవుతుంది; ఎంత ఎక్కువ తెలివి ఉంటే అంత ఎక్కువ దుఃఖం కలుగుతుంది.