నిర్గమ 23
23
న్యాయం కరుణ గురించిన చట్టాలు
1“పుకార్లు ప్రచారం చేయకూడదు. అన్యాయపు సాక్షిగా ఉండి దుర్మార్గులకు సహాయం చేయకూడదు.
2“తప్పు చేయడంలో జనాన్ని అనుసరించవద్దు. మీరు ఒక దావాలో సాక్ష్యం ఇచ్చినప్పుడు, జనంతో కలిసి న్యాయాన్ని వక్రీకరించవద్దు. 3న్యాయం చేసేటప్పుడు పేదవారైనా సరే వారిపట్ల పక్షపాతం చూపకూడదు.
4“ఒకవేళ నీ శత్రువు యొక్క ఎద్దు గాని గాడిద గాని తప్పిపోయి తిరుగుతూ నీకు కనబడితే, దానిని తప్పక తిరిగి అప్పగించాలి. 5నిన్ను ద్వేషించేవారి గాడిద ఒకవేళ అది మోస్తున్న బరువు క్రింద పడివుండడం చూస్తే దానిని అలాగే వదిలేయవద్దు; దానిని లేపడానికి వానికి ఖచ్చితంగా సహాయం చేయాలి.
6“న్యాయవిషయంలో పేదవారికి అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. 7తప్పుడు ఆరోపణలకు దూరంగా ఉండాలి, అమాయక లేదా నిజాయితీగల వ్యక్తిని చంపవద్దు, ఎందుకంటే నేను దోషులను నిర్దోషిగా ప్రకటించను.
8“లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం చూసేవారికి గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.
9“పరదేశిని అణగద్రొక్కకూడదు; మీరు ఈజిప్టులో విదేశీయులుగా ఉన్నారు కాబట్టి విదేశీయుల జీవితం ఎలా ఉంటుందో మీకే తెలుసు కదా!
సబ్బాతు గురించిన చట్టాలు
10“ఆరు సంవత్సరాలు మీరు పొలంలో విత్తనాలు విత్తి పంట కోయాలి, 11ఏడవ సంవత్సరం ఆ భూమిని దున్నకుండా ఉపయోగించకుండా వదిలేయాలి. అప్పుడు మీ ప్రజల్లో పేదవారు దాని నుండి ఆహారం తీసుకోగా మిగిలింది అడవి జంతువులు తినవచ్చు. మీ ద్రాక్షతోటకు ఒలీవతోటకు ఇలాగే చేయాలి.
12“ఆరు రోజులు మీ పని చేసుకోండి, కానీ ఏడవ రోజు పని చేయకండి, తద్వారా మీ ఎద్దు, మీ గాడిద విశ్రాంతి తీసుకోవచ్చు, మీ ఇంట్లో జన్మించిన దాసి కుమారుడు, మీ మధ్య నివసించే విదేశీయుడు సేదదీరుతారు.
13“నేను మీతో చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించండి. మరొక దేవుళ్ళ పేరును ఉచ్చరించకూడదు. అవి మీ నోటి నుండి వినిపించకూడదు.
మూడు వార్షిక పండుగలు
14“సంవత్సరానికి మూడుసార్లు మీరు నాకు పండుగ జరపాలి.
15“పులియని రొట్టెల పండుగ జరుపుకోండి; నేను మీకు ఆజ్ఞాపించినట్లు ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి. అబీబు నెలలో నిర్ణీత సమయంలో ఇలా తినండి, ఎందుకంటే ఆ నెలలో మీరు ఈజిప్టు నుండి వచ్చారు.
“నా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.
16“మీరు మీ పొలంలో విత్తి పండించిన ప్రథమ ఫలాలతో కోత కాల పండుగ చేయాలి.
“పొలం నుండి మీ పంటలన్నిటిని కూర్చుకున్న తర్వాత సంవత్సరం చివరిలో పంటకూర్పు పండుగ#23:16 ఇది తర్వాత పర్ణశాలల పండుగ అని పిలువబడింది. లేవీ 23:16-20 చూడండి. చేయాలి.
17“సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిలో కనబడాలి.
18“పులిసిన దానితో కలిపి నాకు బలి యొక్క రక్తాన్ని అర్పించకూడదు.
“నా పండుగ అర్పణల క్రొవ్వును ఉదయం వరకు ఉంచవద్దు.
19“మీ పొలంలో పండిన ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని మీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి.
“మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
మార్గాన్ని సిద్ధపరచడానికి దేవదూత
20“ఇదిగో, మార్గమంతటిలో మిమ్మల్ని కాపాడి నేను సిద్ధం చేసి ఉంచిన చోటికి మిమ్మల్ని తీసుకురావడానికి ఒక దేవదూతను మీకు ముందుగా పంపుతున్నాను. 21ఆయన పట్ల శ్రద్ధ వహించండి, ఆయన చెప్పేది వినండి. ఆయనకు ఎదురు తిరుగవద్దు; నా నామం ఆయనలో ఉంది, కాబట్టి ఆయన మీ తిరుగుబాటును క్షమించరు. 22మీరు ఆయన చెప్పేది జాగ్రత్తగా విని నేను చెప్పేవాటన్నిటిని చేస్తే, నేను మీ శత్రువులకు శత్రువుగా ఉంటాను, మిమ్మల్ని వ్యతిరేకించే వారిని వ్యతిరేకిస్తాను. 23నా దూత మీకు ముందుగా వెళ్తూ, అమోరీయుల హిత్తీయుల పెరిజ్జీయుల కనానీయుల హివ్వీయుల యెబూసీయుల దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాడు, నేను వారిని నిర్మూలం చేస్తాను. 24మీరు వారి దేవుళ్ళ ముందు సాష్టాంగపడకూడదు వాటిని పూజించకూడదు, వారి ఆచారాలను పాటించకూడదు. మీరు వాటిని కూల్చివేసి వారి పవిత్ర రాళ్లను ముక్కలు చేయాలి. 25మీ దేవుడైన యెహోవాను ఆరాధించండి, ఆయన ఆశీర్వాదం మీ ఆహారం మీద నీటి మీద ఉంటుంది. నేను మీ మధ్య నుండి రోగాన్ని తీసివేస్తాను, 26మీ దేశంలో ఏ స్త్రీకి గర్భస్రావం కలుగదు లేదా గొడ్రాలిగా ఉండదు. నేను మీకు సంపూర్ణ జీవితకాలాన్ని ఇస్తాను.
27“మీకు ఎదురయ్యే ప్రతి దేశానికి మీకు ముందుగా నా భయాన్ని పంపించి వారిని గందరగోళంలో పడవేస్తాను. నేను మీ శత్రువులందరిని వెనుతిరిగి పారిపోయేలా చేస్తాను. 28మీ మార్గంలో నుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టడానికి మీకు ముందుగా కందిరీగలను పంపిస్తాను. 29కానీ నేను ఒకే సంవత్సరంలో వారిని తరిమికొట్టను, ఎందుకంటే భూమి నిర్జనమైపోతుంది, అడవి జంతువులు మీకు చాలా ఎక్కువై మీకు హాని కలిగిస్తాయి. 30మీరు అభివృద్ధిచెంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేవరకు, కొద్దికొద్దిగా వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడతాను.
31“ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రం#23:31 హెబ్రీలో ఫిలిష్తీయుల సముద్రం వరకు, అరణ్యం నుండి యూఫ్రటీసు నది వరకు నేను మీకు సరిహద్దులును ఏర్పరుస్తాను. ఆ దేశంలో నివసించే ప్రజలను మీ చేతికి అప్పగిస్తాను, మీరు వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడతారు. 32వారితో గాని వారి దేవుళ్ళతో గాని ఎలాంటి ఒడంబడిక చేసుకోవద్దు. 33వారిని మీ దేశంలో నివసింపనివ్వకండి లేదా మీరు నాకు వ్యతిరేకంగా పాపం చేయడానికి వారు కారణమవుతారు, ఎందుకంటే మీరు వారి దేవుళ్ళను సేవించడం ఖచ్చితంగా మీకు ఉరి అవుతుంది.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నిర్గమ 23: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: