ఎజ్రా 6
6
దర్యావేషు ఆదేశం
1అప్పుడు రాజైన దర్యావేషు ఆదేశించగా వారు బబులోను ఖజానాలోని రాజ్య దస్తావేజులన్ని పరిశోధించారు. 2మాదీయ ప్రాంతంలో ఉన్న ఎక్బతానా కోటలో ఒక గ్రంథపుచుట్ట దొరికింది. దాని మీద ఇలా వ్రాసి ఉంది:
వ్రాతపూర్వక సందేశము:
3రాజైన కోరెషు పాలనలో మొదటి సంవత్సరంలో యెరూషలేములోని దేవుని దేవాలయం గురించి రాజు జారీ చేసిన శాసనం:
బలులు అర్పించే స్థలంగా మందిరాన్ని తిరిగి కట్టాలి, దాని పునాదులు వేయాలి. దాని ఎత్తు అరవై మూరలు,#6:3 అంటే, సుమారు 27 మీటర్లు వెడల్పు అరవై మూరలు ఉండాలి. 4పెద్ద రాళ్లతో మూడు వరుసలు, క్రొత్త కలపతో ఒక వరుస పెట్టి కట్టాలి. దానికయ్యే ఖర్చు రాజ్య ఖజానా నుండి చెల్లించాలి. 5అంతేకాక, నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోనుకు తీసుకువచ్చిన దేవుని ఆలయానికి సంబంధించిన వెండి బంగారు వస్తువులను తిరిగి యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లి వాటి స్థానాల్లో పెట్టాలి; వాటిని దేవుని మందిరంలోనే ఉంచాలి.
6అందుకు ఇప్పుడు, యూఫ్రటీసు నది అవతల అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు దీనికి దూరంగా ఉండాలి. 7దేవుని ఆలయ పనికి ఆటంకం కలిగించకూడదు. యూదుల అధిపతిని, యూదుల పెద్దలను దేవుని మందిరాన్ని దాని స్థానంలో కట్టనివ్వండి.
8అంతేకాక, దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి ఈ యూదుల పెద్దలకు మీరు అందించవలసిన సహాయం గురించి కూడా నేను మీకు ఆదేశం ఇస్తున్నాను:
యూఫ్రటీసు నది అవతల నుండి రాజ ఖజానాకు వచ్చిన పన్నుల నుండి వారి ఖర్చులన్నిటిని చెల్లించాలి, తద్వారా వారి పని ఆగదు. 9వారికి అవసరమైన వాటిని అనగా పరలోక దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు యెరూషలేములోని యాజకులు అడిగే గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, ఒలీవనూనె, ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి అందించాలి. 10తద్వారా వారు బలులు అర్పించి పరలోక దేవుని సంతోషపరచి రాజు, అతని కుమారుల క్షేమం గురించి ప్రార్థిస్తారు.
11అంతేకాక, నా ఆదేశం ఏంటంటే, ఎవరైనా ఈ ఆజ్ఞ పాటించకపోతే వారి ఇంటి నుండి దూలాన్ని తీసి దానికి వారిని ఉరితీయాలి. ఈ నేరం బట్టి వారి ఇంటిని చెత్తకుప్పగా చేయాలి. 12ఏ రాజైన ఏ ప్రజలైనా ఈ ఆజ్ఞను మీరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే తన నామాన్ని అక్కడ ఉంచిన దేవుడు వారిని పడగొట్టును గాక.
దర్యావేషు అనే నేను ఆదేశిస్తున్నాను. దీనిని ఖచ్చితంగా శ్రద్ధతో పాటించాలి.
ఆలయ నిర్మాణం పూర్తి ప్రతిష్ఠించుట
13తర్వాత, రాజైన దర్యావేషు పంపించిన శాసనం ప్రకారం, యూఫ్రటీసు నది అవతలి అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు పని చేయించారు. 14ప్రవక్తయైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జెకర్యాల ప్రవచనాలను బట్టి యూదుల పెద్దలు పనిని సక్రమంగా కొనసాగించారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ప్రకారం పర్షియా రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆదేశాలను అనుసరించి వారు మందిరాన్ని కట్టడం ముగించారు. 15రాజైన దర్యావేషు పాలనలోని ఆరవ సంవత్సరంలో అదారు నెల మూడవ రోజున మందిరం పూర్తి అయ్యింది.
16అప్పుడు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు చెర నుండి విడుదలై వచ్చిన వారందరు కలిసి ఆనందంతో మందిరాన్ని ప్రతిష్ఠించారు. 17దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించడానికి వారు ఆ రోజున వంద ఎడ్లు, రెండువందల పొట్టేళ్లు, నాలుగువందల గొర్రెపిల్లలు, ఇశ్రాయేలీయులందరి కోసం పాపపరిహారబలిగా#6:17 లేదా శుద్ధీకరణ అర్పణ ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున పన్నెండు మేకపోతులను బలి అర్పించారు. 18యెరూషలేములో దేవుని సేవ చేయడానికి మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం వారి వారి తరగతుల ప్రకారం యాజకులను వారివారి వరుసల ప్రకారం లేవీయులను నియమించారు.
పస్కాపండుగ
19చెర నుండి విడుదలై వచ్చినవారు మొదటి నెల పద్నాలుగవ రోజు పస్కాపండుగ చేసుకున్నారు. 20యాజకులు, లేవీయులు తమను తాము శుద్ధి చేసుకుని పవిత్రులయ్యారు. లేవీయులు చెర నుండి విడుదలైన వారందరి కోసం, తమ బంధువులైన యాజకుల కోసం, తమ కోసం పస్కా గొర్రెపిల్లను వధించారు. 21చెర నుండి విడుదలై వచ్చిన ఇశ్రాయేలీయులు, దేశంలో పొరుగు ప్రజల అపవిత్ర ప్రవర్తను నుండి తమను తాము ప్రత్యేకించుకొని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కొలిచే వారంతా కలిసి పస్కాను తిన్నారు. 22ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనిలో సహకరించేలా యెహోవా అష్షూరు రాజు హృదయాన్ని మార్చి వారికి సంతోషాన్ని కలిగించినందుకు వారు ఏడు రోజులు పులియని రొట్టెల పండుగను ఆనందంతో జరుపుకున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎజ్రా 6: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: