యెషయా 18
18
కూషుకు వ్యతిరేకంగా ప్రవచనం
1కూషు#18:1 అంటే, నైలు ఉపరితల ప్రాంతం నదుల అవతల
సందడి చేసే రెక్కల దేశమా#18:1 రెక్కల దేశమా లేదా మిడతల దేశమా, నీకు శ్రమ!
2అది సముద్ర మార్గంలో నీటి మీద
జమ్ము పడవలలో దూతలను పంపుతుంది.
తొందరపడే దూతలారా!
వారు నునుపైన చర్మం గల ఎత్తైన ప్రజల దగ్గరకు,
దూరంలోనున్న భయపెట్టే ప్రజల దగ్గరకు,
నదులు పారుచున్న దేశం కలిగి
దౌర్జన్యం వింత భాష కలిగిన దేశం దగ్గరకు వెళ్లండి.
3సమస్త లోకవాసులారా,
భూలోక నివాసులారా,
పర్వతాలమీద ఒక జెండాను ఎత్తినప్పుడు
మీరు చూస్తారు,
బూర ఊదినప్పుడు
మీరు వింటారు.
4యెహోవా నాతో చెప్పే మాట ఇది:
“సూర్యకాంతిలోని తీవ్రమైన వేడిలా,
వేసవి కోతకాలంలోని పొగమంచు మేఘంలా,
నేను నిశ్శబ్దంగా నా నివాసస్థలం నుండి చూస్తాను.”
5కోతకాలం రాకముందే, పువ్వు వాడిపోయినప్పుడు
పువ్వు ద్రాక్షగా మారుతున్నప్పుడు
ఆయన మడ్డికత్తులతో ద్రాక్షతీగెలను కత్తిరించి
విస్తరించే తీగెలను తీసివేస్తారు.
6అవి పర్వత పక్షులకు,
భూమిమీది మృగాలకు విడిచిపెట్టబడతాయి;
వాటిని వేసవి కాలమంతా పక్షులు,
శీతాకాలమంతా భూమిమీది మృగాలు తింటాయి.
7ఆ కాలంలో
ఎత్తైన వారు నునుపైన చర్మం గల ప్రజలు
దూరంలోనున్న భయపెట్టే ప్రజలు
నదులు పారుచున్న దేశం కలిగి
దౌర్జన్యం చేసి వింత భాష కలిగిన దేశం
సైన్యాల యెహోవాకు కానుకలు తెస్తారు. సైన్యాల యెహోవా నామానికి నివాసస్థలమైన సీయోను పర్వతానికి ఆ కానుకలు తీసుకువస్తారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 18: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: