యెషయా 43
43
ఇశ్రాయేలు యొక్క ఏకైక రక్షకుడు
1అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా
ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు
ఇలా చెప్తున్నారు:
“భయపడకు నేను నిన్ను విడిపించాను.
పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు.
2నీవు నీళ్లను దాటుతున్నప్పుడు
నేను నీతో ఉంటాను;
నీవు నదులను దాటుతున్నప్పుడు
అవి నిన్ను ముంచవు.
నీవు అగ్ని గుండా నడుస్తున్నప్పుడు
నీవు కాలిపోవు.
మంటలు నిన్ను కాల్చవు.
3యెహోవానైన నేను నీకు దేవుడను.
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నీ రక్షకుడిని.
నీ క్రయధనంగా ఈజిప్టును ఇచ్చాను,
నీకు బదులుగా కూషు సెబాలను ఇచ్చాను.
4నీవు నా దృష్టిలో విలువైనవాడవు, ఘనుడవు కాబట్టి,
నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
నీకు బదులుగా మనుష్యులను అప్పగిస్తాను
నీ ప్రాణానికి బదులుగా దేశాలను అప్పగిస్తాను.
5భయపడకు, నేను నీతో ఉన్నాను;
తూర్పు నుండి నీ సంతానాన్ని తీసుకువస్తాను,
పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.
6‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు,
‘వారిని ఆపవద్దు’ అని దక్షిణ దిక్కుకు చెప్తాను.
దూరం నుండి నా కుమారులను
భూమి అంచుల నుండి నా కుమార్తెలను తీసుకురండి.
7నా పేరుపెట్టబడిన వారందరిని,
నా మహిమ కోసం నేను సృష్టించిన వారిని,
నేను రూపించి కలుగజేసిన వారిని తీసుకురండి.”
8కళ్లుండి గ్రుడ్డివారైన వారిని,
చెవులుండి చెవిటివారైన వారిని తీసుకురండి.
9సర్వ దేశాలు గుమికూడాలి
జనములు సమావేశమవ్వాలి.
వారిలో ఎవరి దేవుళ్ళు ఇలాంటి సంగతులు మాకు తెలియజేశారు?
గతంలో జరిగిన వాటిని ఎవరు మాకు చెప్పారు?
తాము నిర్దోషులని నిరూపించడానికి తమ సాక్షులను తీసుకురావాలి,
అప్పుడు ఇతరులు విని, “ఇది నిజమే” అని చెప్తారు.
10“మీరు నా సాక్షులు” అని యెహోవా చెప్తున్నారు,
“నేను ఏర్పరచుకున్న నా సేవకుడవు,
తద్వారా నీవు నన్ను తెలుసుకొని, నన్ను నమ్మి,
నేనే ఆయననని నీవు గ్రహిస్తావు.
నాకు ముందుగా ఏ దేవుడు లేడు.
నా తర్వాత ఏ దేవుడు ఉండడు.
11నేను నేనే యెహోవాను,
నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.
12బయలుపరిచింది రక్షించింది ప్రకటించింది నేనే
మీ మధ్య ఉన్నది నేనే, ఏ ఇతర దేవుడో కాదు.
నేనే దేవుడను మీరు నా సాక్షులు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
13“అవును, పూర్వ రోజులనుండి ఉన్నవాడను నేనే.
నా చేతిలో నుండి ఎవరు విడిపించలేరు.
నేను చేసే పనిని తిప్పగలవారు ఎవరు?”
అని యెహోవా చెప్తున్నారు.
దేవుని కరుణ, ఇశ్రాయేలు నమ్మకద్రోహం
14ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు
మీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే:
“మీ కోసం నేను బబులోనుకు సైన్యాన్ని పంపి
బబులోనీయులందరూ వేటిని బట్టి గర్వించేవారో
వారిని ఆ ఓడలలో పారిపోయేలా చేస్తాను.
15యెహోవానైన నేనే మీకు పరిశుద్ధ దేవుడను.
ఇశ్రాయేలును సృజించిన నేనే మీకు రాజును.”
16యెహోవా ఇలా అంటున్నారు:
సముద్రంలో మార్గాన్ని ఏర్పరచినవాడు,
గొప్ప జలాల్లో దారిని కలుగజేసినవాడు,
17రథాలను గుర్రాలను,
సైన్యాన్ని వీరులను రప్పించిన యెహోవా చెప్పే మాట ఇదే
వారందరు కలిసి పడిపోయారు మరలా ఎప్పటికీ లేవరు,
ఆరిపోయిన వత్తిలా వారు నిర్మూలించబడతారు:
18“పూర్వ విషయాల్ని మరచిపోండి;
గత సంగతులను ఆలోచించకండి.
19చూడండి, నేను ఒక క్రొత్త పని చేస్తున్నాను!
ఇప్పుడే అది మొలకెత్తుతుంది; మీరు దానిని గ్రహించలేదా?
నేను అరణ్యంలో దారి కలుగజేస్తున్నాను,
ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను.
20నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగడానికి
అరణ్యంలో నీళ్లు ఇస్తున్నాను
ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను కాబట్టి
అడవి జంతువులు, నక్కలు
నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి.
21వారు నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు,
వారు నా సుత్తిని ప్రకటిస్తారు.
22“అయినా యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు.
ఇశ్రాయేలూ, నా గురించి నీవు విసిగిపోయావు.
23దహనబలులకు గొర్రెలను నా దగ్గరకు తీసుకురాలేదు,
నీ బలులతో నన్ను ఘనపరచలేదు.
భోజనార్పణల కోసం నేను నీ మీద భారం మోపలేదు
ధూపం వేయమని నిన్ను విసిగించలేదు.
24నీవు నా కోసం సువాసనగల లవంగపు చెక్కను డబ్బుతో కొనలేదు,
నీ బలి పశువుల క్రొవ్వుతో నన్ను తృప్తిపరచలేదు.
కాని నీ పాపాలతో నన్ను విసిగించావు
నీ దోషాలతో నేను అలసిపోయేలా చేశావు.
25“నేను నేనే నా ఇష్టానుసారంగా
నీ పాపాలను తుడిచివేస్తున్నాను,
నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను.
26నాకు గతంలో జరిగింది గుర్తు చేయి
మనం కలిసి వాదించుకుందాం;
నిన్ను నీవు నీతిమంతునిగా రుజువు చేసుకో.
27నీ మూలపురుషుడు పాపం చేశాడు;
నీకు బోధించమని నేను పంపినవారు నా మీద తిరుగుబాటు చేశారు.
28కాబట్టి నేను నీ మందిరంలోని ప్రధానులను అవమానించాను;
నేను యాకోబును నాశనానికి#43:28 ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే.
ఇశ్రాయేలును దూషణకు అప్పగించాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 43: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: