యోబు 17
17
1“నా ప్రాణం క్రుంగిపోయింది,
నా రోజులు కుదించబడ్డాయి.
సమాధి నా కోసం ఎదురుచూస్తుంది.
2ఎగతాళి చేసేవారు నన్ను చుట్టుముట్టారు;
నేను చూస్తూ ఉండగానే వారు వివాదం రేపుతున్నారు.
3“దేవా, మీరే నా కోసం జామీనుగా నిలవండి.
ఇంకెవరు నాకు భద్రత ఇవ్వగలరు?
4గ్రహించకుండా మీరు వారి హృదయాలను మూసివేశారు.
కాబట్టి మీరు వారిని విజయం పొందనివ్వరు.
5స్వలాభం కోసం తమ స్నేహితులను ఎవరైనా మోసం చేస్తే
వారి పిల్లల కళ్లు మసకబారతాయి.
6“దేవుడు నన్ను ప్రజలందరికి ఒక సామెతగా చేశారు,
నా ముఖం మీద ప్రజలు ఉమ్మివేస్తారు.
7దుఃఖంతో నా చూపు మందగించింది.
నా అవయవాలు నీడలా మారాయి.
8యథార్థవంతులు దీనినిచూసి ఆశ్చర్యపడతారు;
నిర్దోషులు భక్తిహీనులను చూసి ఆందోళన చెందుతారు.
9అయితే నీతిమంతులు తమ మార్గాలను విడిచిపెట్టరు,
నిరపరాధులు బలాన్ని పొందుకుంటారు.
10“మీరందరు మరోసారి రండి, మరలా ప్రయత్నించండి!
నాకు మీలో జ్ఞానవంతుడు ఒక్కడు కూడా కనిపించలేదు.
11నా రోజులు గతించిపోయాయి, నా ఆలోచనలు వ్యర్థమయ్యాయి.
నా హృదయ వాంఛలు భంగమయ్యాయి.
12ఈ మనుష్యులు రాత్రిని పగలని,
చీకటి కమ్ముకున్నప్పుడు వెలుగు వచ్చిందని వాదిస్తారు.
13నాకున్న ఆశ ఏంటంటే సమాధి నాకు ఇల్లు అవ్వాలి,
చీకటిలో నా పరుపు పరచుకోవాలి.
14నేను అవినీతితో, ‘నీవే నా తండ్రివి’ అని,
పురుగుతో, ‘నా తల్లివి’ లేదా ‘నా సోదరివి’ అని అంటే,
15అప్పుడు నా నిరీక్షణ ఎక్కడున్నట్టు!
నా గురించి ఎవరికైనా నిరీక్షణ ఉంటుందా?
16అది మరణపు తలుపుల దగ్గరకు దిగిపోతుందా?
నాతో పాటు మట్టిలో కలిసిపోదా?”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 17: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: