యోబు 20
20
జోఫరు
1అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:
2“నేను చాలా ఆందోళన చెందగా,
జవాబివ్వాలని నా ఆలోచనలు నన్ను తొందర చేస్తున్నాయి.
3నాకు అవమానం కలిగించే నిందను నేను విన్నాను,
కాబట్టి నా వివేకం జవాబు చెప్పేలా నన్ను ప్రేరేపిస్తుంది.
4“అనాది కాలం నుండి ఎలా ఉందో నీకు తెలుసు,
భూమి మీద నరుడు#20:4 లేదా ఆదాము ఉంచబడినప్పటి నుండి ఏమి జరుగుతున్నది నీకు తెలుసు.
5దుర్మార్గుల ఉల్లాసం కొద్దిసేపే అని,
భక్తిహీనుల సంతోషం ఒక క్షణమే ఉంటుందని నీకు తెలుసు.
6భక్తిహీనుల గర్వం ఆకాశాలను అంటినా
వారి తల మేఘాలను తాకినా,
7వారి మలంలా వారు కూడా ఎప్పటికి కనబడకుండా నశిస్తారు;
వారిని చూసినవారు, ‘వారెక్కడ ఉన్నారు?’ అని అడుగుతారు.
8కలలా వారు చెదిరిపోయి కనుమరుగవుతారు,
రాత్రి స్వప్నంలా వారు చెదిరిపోతారు.
9వారిని చూసిన కన్ను మరలా వారిని చూడదు;
వారి స్థలం వారిని మరలా చూడదు.
10వారి పిల్లలు పేదవారి సహాయం అడుగుతారు;
వారి చేతులు తమ ఆస్తిని తిరిగి ఇచ్చేస్తాయి.
11వారి ఎముకల్లో నిండి ఉన్న యవ్వన బలం
వారితో పాటు మట్టిపాలవుతుంది.
12“చెడుతనం వారి నోటికి తీయగా ఉన్నా,
నాలుక క్రింద వారు దాన్ని దాచినా,
13భరించలేకపోయినా దాన్ని విడిచిపెట్టలేదు
తమ నోటిలో భద్రం చేసుకున్నారు,
14వారి ఆహారం వారి కడుపులో పులిసిపోతుంది;
అది వారిలో నాగుపాముల విషంలా మారుతుంది.
15వారు మ్రింగిన ఐశ్వర్యాన్ని కక్కివేస్తారు;
దేవుడు వారి కడుపు లోనిది కక్కిస్తారు.
16వారు నాగుపాముల విషాన్ని పీల్చుకుంటారు;
పాము కోరలు వారిని చంపుతాయి.
17నదిలా ప్రవహించే తేనె మీగడలు చూసి,
వారు ఆనందించలేరు.
18వారు కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించకుండానే తిరిగి ఇచ్చేస్తారు;
తమ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని వారు ఆస్వాదించరు.
19ఎందుకంటే వారు పేదలను వేధించి వారిని దిక్కులేనివారిగా చేశారు;
తాను కట్టని ఇళ్ళను వారు ఆక్రమించారు.
20“వారి అత్యాశకు అంతం ఉండదు;
వారికున్న సంపదలతో తమను తాము రక్షించుకోలేడు.
21వారు మ్రింగివేయడానికి వారికి ఏమి మిగల్లేదు;
వారి అభివృద్ధి నిలబడదు.
22వారికి సమృద్ధి కలిగినప్పుడు ఇబ్బందిపడతారు;
కష్టాల భారం వారి మీద పడుతుంది.
23వారు తమ కడుపు నింపుకునేప్పుడు,
దేవుడు తన కోపాగ్నిని వారి మీద కురిపిస్తారు,
వారి మీద కష్టాలను కురిపిస్తారు.
24ఇనుప ఆయుధం నుండి వారు తప్పించుకున్నా
ఇత్తడి విల్లు నుండి బాణం వారి గుండా దూసుకుపోతుంది.
25దానిని వెనుక నుండి బయటకు తీయగా
మెరుస్తున్న ఆ బాణం అంచు వారి కాలేయాన్ని ముక్కలు చేస్తుంది.
మరణభయం వారిని కమ్ముకుంటుంది;
26వారి సంపదలు చీకటిమయం అవుతాయి,
ఎవరూ ఊదకుండానే మంటలు రాజుకొని వారిని దహించి వేసి,
వారి గుడారాల్లో మిగిలినదంతా నాశనం చేస్తుంది.
27ఆకాశాలు వారి అపరాధాన్ని బయటపెడతాయి;
భూమి వారి మీదికి లేస్తుంది.
28దేవుని కోపదినాన ప్రవహించే నీటిలో,
వారి ఇళ్ళు కొట్టుకుపోతాయి.
29దుష్టులకు దేవుడు నియమించిన,
వారసత్వం ఇదే.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 20: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: