యోబు 34

34
1అప్పుడు ఎలీహు అన్నాడు:
2“జ్ఞానులారా, మీరు నా మాటలు వినండి;
అనుభవజ్ఞులారా, నేను చెప్పేది వినండి.
3నాలుక ఆహారాన్ని రుచి చూసినట్లు.
చెవి మాటలను పరిశీలిస్తుంది.
4మనకు న్యాయమైన దానిని వివేచిద్దాం;
మనకు మేలైన దానిని తెలుసుకుందాము.
5“యోబు, ‘నేను నిర్దోషిని,
కాని దేవుడు నాకు న్యాయం చేయలేదు.
6నేను న్యాయంగా ఉన్నప్పటికీ
నన్ను అబద్ధికునిగా చూస్తున్నారు;
నా దోషం ఏమి లేనప్పటికి
ఆయన బాణాలు నయంకాని గాయం నాకు కలిగింది’ అన్నాడు.
7యోబువంటి వారు ఎవరైనా ఉన్నారా?
తిరస్కారాన్ని మంచి నీళ్లలా అతడు త్రాగుతున్నాడు.
8కీడు చేసేవారితో అతడు స్నేహంగా ఉంటాడు;
దుర్మార్గులతో నడచుకుంటున్నాడు.
9అతడు అన్నాడు, ‘దేవుని సంతోషపెట్టడం వలన
మనుష్యునికి ఏ లాభం లేదని’ అని.
10“వివేకంగల మనుష్యులారా, నా మాటలు వినండి.
దేవుడు ఎన్నడూ చెడు చేయడు.
సర్వశక్తిమంతుడు ఎన్నడూ తప్పు చేయడు.
11వారందరికి చేసిన వాటికి తగిన ప్రతిఫలాన్ని ఆయన వారికిస్తారు;
ఎవరి నడతకు తగ్గఫలాన్ని ఆయన వారికి ముట్టచెప్తారు.
12దేవుడు ఎన్నడూ దుష్కార్యం చేయడు,
సర్వశక్తుడు న్యాయం తప్పడు.
13భూమి మీద ఆయనను నియమించింది ఎవరు?
సర్వలోకానికి ఆయనను అధిపతిగా చేసింది ఎవరు?
14దేవుడే కాబట్టి స్వార్థపరుడై ఉండి
తన ఆత్మను ఊపిరిని తొలగించి వేస్తే,
15మనుష్యులంతా ఒకేసారి నశించిపోతారు,
మానవులు తిరిగి దుమ్ములో కలిసిపోతారు.
16“నీవు జ్ఞానం కలిగి ఉంటే, ఇది విను;
నేను చెప్పేది ఆలకించు.
17న్యాయాన్ని ద్వేషించేవాడు పరిపాలించగలడా?
బలాఢ్యుడైన న్యాయవంతుడైన దేవుని మీద నీవు నేరం మోపుతావా?
18‘మీరు పనికిమాలినవారు’ అని రాజులతో,
‘మీరు దుష్టులు’ అని సంస్థానాధిపతులతో చెప్పేవాడు ఈయన కాడా,
19ఆయన అధికారులంటే పక్షపాతం లేదు
ఆయన బీదలను కాదని ధనవంతులకు దయచూపించడు,
అందరు ఆయన చేతుల్లో సృష్టించబడినవారే కదా.
20వారు నిమిషంలోనే మధ్యరాత్రిలోనే చనిపోతారు;
వారు కదిలించబడి మరణిస్తారు;
మానవ ప్రమేయం లేకుండానే బలవంతులు తీసుకెళ్తారు.
21“మానవుల మార్గాలన్నిటిని ఆయన చూస్తున్నారు.
వారి ప్రతి అడుగును ఆయన గమనిస్తున్నారు.
22చెడు చేసేవారు దాక్కోవడానికి
చీకటియైనా మరణాంధకారమైనా లేదు.
23ఒకరు దేవుని ఎదుట న్యాయవిచారణలోకి రాకముందే,
వానిని ఎక్కువగా విచారణ చేయనవసరం ఆయనకు లేదు.
24విచారణలేకుండానే ఆయన బలవంతులను ముక్కలుగా చేస్తారు
వారి స్థానంలో ఇతరులను నియమిస్తారు.
25ఎందుకంటే వారి పనులెలాంటివో ఆయనకు తెలుసు,
రాత్రివేళలో ఆయన వారిని పడద్రోయగా వారు నలుగగొట్టబడతారు.
26అందరు చూస్తూ ఉండగానే
వారి దుర్మార్గాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తారు.
27ఎందుకంటే, వారు ఆయనను అనుసరించుట మానుకున్నారు,
ఆయన మార్గాల్లో దేన్ని వారు గ్రహించలేదు.
28బీదలు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టేలా వారు చేశారు;
అవసరతలో ఉన్న వారి మొరను ఆయన ఆలకిస్తారు.
29ఆయన మౌనంగా ఉంటే ఆయనకు శిక్ష విధించగలవారెవరు?
ఆయన తన ముఖం దాచుకొంటే ఆయనను చూడగలవారెవరు?
ఒక్క వ్యక్తికైనా దేశమంతటికైనా ఆయన విధానం ఒక్కటే,
30భక్తిహీనులు పరిపాలించకుండ చేయడం,
మనుష్యులకు ఉచ్చులు బిగించకుండా వారిని అడ్డుకోవడము.
31“ఒకవేళ ఎవరైనా దేవునితో,
‘నేను శిక్షను భరించాను ఇకమీదట నేరం చేయను.
32నేను చూడలేనిది నాకు చూపించు;
నేనేదైనా తప్పు చేసివుంటే ఇకమీదట అలాంటిది చేయను’ అనవచ్చు.
33నీవు పశ్చాత్తాపపడేందుకు నిరాకరించినప్పుడు
దేవుడు నీ షరతుల ప్రకారం నీకు ప్రతిఫలమిస్తాడా?
నేను కాదు, నీవే నిర్ణయించుకోవాలి;
నీకు తెలిసింది నాకు చెప్పు.
34“వివేకంగలవారు, జ్ఞానంగలవారు నా మాటలు విని
నాతో ఇలా చెప్తారు,
35‘యోబు తెలివిలేని లేకుండ మాట్లాడుతున్నాడు;
అతని మాటల్లో వివేకం లోపించింది.’
36యోబు దుష్టునిలా జవాబిచ్చినందుకు
చివరి వరకు అతడు పరీక్షించబడుతూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను.
37అతడు తన పాపానికి తిరుగుబాటును జతచేశాడు;
అతడు మన మధ్య తిరస్కారంతో చప్పట్లు కొట్టి
దేవునికి విరుద్ధంగా ఎన్నో మాటలు మాట్లాడాడు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 34: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి