లేవీయ 17
17
రక్తం తినడం నిషేధం
1యెహోవా మోషేతో ఇలా అన్నారు, 2“అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘యెహోవా ఆజ్ఞాపించింది ఇది: 3-4ఏ ఇశ్రాయేలీయుడైనా ఒక ఎద్దును, గొర్రెపిల్లను లేదా మేకను యెహోవా ఎదుట సమావేశ గుడార ప్రవేశం ముందు కాక శిబిరంలో గాని శిబిరం బయట గాని బలి ఇస్తే, వారు రక్తపాతం కలిగించిన అపరాధులుగా పరిగణించబడతారు; వారు రక్తం చిందించినవారు కాబట్టి వారు వారి ప్రజల నుండి కొట్టివేయబడాలి. 5కాబట్టి ఇశ్రాయేలీయులు బయట పొలాల్లో అర్పిస్తున్న బలులను ఇకపై యెహోవా ఎదుట సమర్పించాలి. వారు సమావేశ గుడారపు ద్వారం దగ్గర యెహోవాకు సమాధానబలులుగా అర్పించడానికి యాజకుని దగ్గరకు తీసుకురావాలి. 6సమావేశ గుడార ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా బలిపీఠం మీద యాజకుడు రక్తాన్ని చల్లి, క్రొవ్వును యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి. 7వారు వ్యభిచారం చేస్తూ వచ్చిన మేక విగ్రహాలకు#17:7 లేక దయ్యాలకు ఇకపై తమ బలులను అర్పించకూడదు. ఇది వారికి, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.’
8“వారితో ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలీయులలో గాని వారి మధ్యలో నివసించే విదేశీయులలో గాని ఎవరైనా దహనబలిని గాని మరేదైనా బలిని గాని అర్పించాలనుకుని 9యెహోవాకు బలి ఇవ్వడానికి సమావేశ గుడార ద్వారం దగ్గరకు దాన్ని తీసుకురాకపోతే వారు ఇశ్రాయేలు ప్రజల నుండి తొలగించబడాలి.
10“ ‘ఇశ్రాయేలీయులలో గాని వారి మధ్యలో నివసించే విదేశీయులలో గాని ఎవరైనా రక్తాన్ని తింటే వారికి నేను విరోధంగా ఉంటాను, వారిని తమ ప్రజల నుండి తొలగిస్తాను. 11ఎందుకంటే, ఒక జీవికి ప్రాణం రక్తంలో ఉంది, బలిపీఠం మీద మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నేను దానిని మీకిచ్చాను. ఇది ఒకరి జీవితానికి ప్రాయశ్చిత్తం చేసే రక్తము. 12అందుకే, “మీలో గాని, మీ మధ్య ఉన్న విదేశీయులలో గాని ఎవరూ రక్తాన్ని తినకూడదు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.
13“ ‘ఇశ్రాయేలీయులలో వారి మధ్య నివసించే విదేశీయులలో ఎవరైనా వేటాడుతూ జంతువును గాని పక్షిని గాని పట్టుకుంటే అతడు దాని రక్తాన్ని పూర్తిగా పారబోసి మట్టితో కప్పెయ్యాలి, 14ఎందుకంటే ప్రతి జీవికి ప్రాణం దాని రక్తము. అందుకే, “ప్రతి జీవికి ప్రాణం దాని రక్తం కాబట్టి మీరు ఏ ప్రాణి రక్తాన్నీ తినకూడదు. ఎవరైన దానిని తింటే వారు తొలిగించబడతారు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.
15“ ‘ఎవరైన, స్వదేశీయులు గాని విదేశీయులు గాని చచ్చిన జంతువును గాని మృగాలు చీల్చిన పశువులను గాని తింటే, వారు తమ బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. సాయంత్రం వరకు వారు ఆచారరీత్య అపవిత్రులుగా ఉంటారు; తర్వాత శుద్ధులవుతారు. 16వారు తమ బట్టలు ఉతుక్కోకుండా స్నానం చేయకుండ ఉంటే వారి దోషశిక్షకు వారే బాధ్యులవుతారు.’ ”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయ 17: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: