లేవీయ 25
25
సబ్బాతు సంవత్సరం
1సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో ఇలా అన్నారు, 2“ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోయే దేశంలో మీరు ప్రవేశించినప్పుడు, స్వయాన ఆ భూమి కూడా యెహోవాకు సబ్బాతు పాటించాలి. 3ఆరు సంవత్సరాలు పొలంలో విత్తనాలు చల్లాలి విత్తనాలు చల్లవచ్చు, ద్రాక్షతోటలు సాగుచేసుకుని వాటి ఫలాలు సమకూర్చుకోవచ్చు. 4కానీ ఏడవ సంవత్సరం భూమికి సబ్బాతు విశ్రాంతి సంవత్సరం, అది యెహోవాకు సబ్బాతు. మీ పొలాల్లో విత్తనాలు వేయకూడదు. ద్రాక్షతోటలు సాగుచేయకూడదు. 5దానికదిగా పెరిగే పంటను కోయవద్దు, సాగుచేయని మీ ద్రాక్షతోటల నుండి ద్రాక్షపండ్లను కోయవద్దు. భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి ఉండాలి. 6సబ్బాతు సంవత్సరంలో భూమి దానికదిగా ఏ పంట మీకు, మీ దాసులకు, దాసీలకు, మీ మధ్య నివసించే కూలి పనివారికి, అలాగే మీ మధ్య నివసించే విదేశీయులకు ఆహారమవుతుంది, 7అలాగే మీ పశువులకు, మీ దేశంలోని అడవి జంతువులకు ఆహారం అవుతుంది. భూమి దేన్ని ఉత్పత్తి చేసినా తినవచ్చు.
యాభైయవ వార్షికోత్సవం
8“ ‘ఏడు సబ్బాతు విశ్రాంతి సంవత్సరాలు లెక్కించాలి అంటే ఏడు సంవత్సరాలు ఏడు మార్లు గుణిస్తే ఏడు సబ్బాతు విశ్రాంతి సంవత్సరాల కాలం మొత్తం నలభై తొమ్మిది సంవత్సరాలు. 9ఏడవ నెల పదవ రోజు అంతటా బూరధ్వని చేయాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశమంతటా ఈ బూరధ్వని చేయాలి. 10యాభైయవ సంవత్సరాన్ని ప్రతిష్ఠితం చేసి, దేశమంతటా దాని నివాసులందరికి స్వేచ్ఛను ప్రకటించండి. ఇది మీకు యాభైయవ వార్షికోత్సవం అవుతుంది; మీలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబ స్వాస్థ్యానికి, మీ సొంత కుటుంబానికి తిరిగి వెళ్లాలి. 11యాభైయవ సంవత్సరం మీకు వార్షికోత్సవంగా ఉండాలి. ఆ ఏట మీరు విత్తనాలు వేయకూడదు, దానంతట అది పెరిగిన పంట కోయగూడదు. తీర్చిదిద్దని ద్రాక్ష తీగె నుండి పండ్లు కోయగూడదు. 12అది యాభైయవ వార్షికోత్సవం, మీకు పరిశుద్ధంగా ఉండాలి; నేరుగా పొలాల నుండి తీసుకున్న దానిని మాత్రమే తినాలి.
13“ ‘ఈ యాభైయవ వార్షికోత్సవంలో అందరు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్తారు.
14“ ‘మీ సొంత ప్రజలకు స్థలమేదైన అమ్మినా లేదా వారి నుండి కొన్నా, ఒకరిపట్ల ఒకరు స్వప్రయోజనం ఆశించకూడదు. 15గత యాభైయవ వార్షికోత్సవం తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచాయో లెక్క చూసి ఆ ప్రకారం మీ సొంత ప్రజల దగ్గర పొలం కొనాలి. పంట పండించడానికి మిగతా సంవత్సరాల లెక్క ప్రకారమే అతడు అమ్మాలి. 16సంవత్సరాలు చాలా ఉన్నప్పుడు, మీరు ధరను పెంచాలి, సంవత్సరాలు తక్కువగా ఉన్నప్పుడు, మీరు ధరను తగ్గించాలి, ఎందుకంటే మీకు నిజంగా అమ్మబడుతుంది పంటల సంఖ్య. 17ఒకరిపట్ల ఒకరు స్వప్రయోజనం చూసుకోకూడదు కాని మీ దేవునికి భయపడాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.
18“ ‘నా శాసనాలు పాటించండి, నా చట్టాలకు లోబడుటలో జాగ్రత్త వహించండి, తద్వార మీరు దేశంలో క్షేమంగా జీవిస్తారు. 19అప్పుడు భూమి దాని ఫలాలను ఇస్తుంది, మీరు మీ సమృద్ధి నుండి తిని అక్కడ క్షేమంగా జీవిస్తారు. 20“మేము మా పంటలను నాటడం లేదా పండించకపోతే ఏడవ సంవత్సరంలో మేము ఏమి తింటాము?” అని మీరు అడగవచ్చు. 21ఆరవ సంవత్సరంలో మీకు మూడేళ్లకు తగినంత దిగుబడిని భూమి ఇచ్చేటువంటి ఆశీర్వాదం నేను పంపుతాను. 22ఎనిమిదవ సంవత్సరంలో మళ్ళీ విత్తనాలు వేయండి. ఆ సంవత్సరంలో మళ్ళీ తొమ్మిదవ సంవత్సరంలో పంట కూర్చునే వరకు మీరు ఆ పంటే తింటారు.
23“ ‘భూమి శాశ్వతంగా అమ్మకూడదు, ఎందుకంటే భూమి నాది, మీరు నా భూమిలో విదేశీయులు, అపరిచితులుగా నివసిస్తున్నారు. 24మీరు స్వాధీనంగా కలిగి ఉన్న భూమి అంతటా, మీరు భూమిని విడిపించడానికి తప్పక ఏర్పాటు చేయాలి.
25“ ‘ఒకవేళ మీ తోటి ఇశ్రాయేలీయులలో ఒకరు పేదవారిగా మారి వారి ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మితే, వారి అతి సమీపబంధువు వచ్చి వారు అమ్మిన వాటిని తిరిగి విడిపించాలి. 26ఒకవేళ, వారి కోసం దానిని విడిపించడానికి సమీపబంధువు ఎవరు లేకపోతే, కాని తర్వాత వారు వృద్ధి చెంది దానిని విడిపించుకోడానికి తగినంత సంపాదిస్తే, 27వారు దాన్ని కొన్నప్పటి నుండి వారు విలువను నిర్ణయించి, బకాయిలను వారు ఎవరికి అమ్మారో వారికి తిరిగి చెల్లించాలి; వారు తిరిగి వారి సొంత ఆస్తికి వెళ్లవచ్చు. 28ఆస్తి మళ్ళీ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు వారికి దొరక్కపోతే, వారు అమ్మిన ఆస్తి యాభైయవ వార్షికోత్సవం వరకు కొన్న వారి స్వాధీనమవుతుంది. యాభైయవ వార్షికోత్సవంలో అది వారికి తిరిగి ఇవ్వబడుతుంది, వారు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్లవచ్చు.
29“ ‘ప్రాకారాలు గల పట్టణంలో ఎవరైనా ఇంటిని అమ్మితే, దాని అమ్మకం తర్వాత పూర్తి సంవత్సరం విముక్తి హక్కును కలిగి ఉంటారు. ఆ సమయంలో అమ్మేవారు దానిని విడిపించవచ్చు. 30ఒకవేళ సంవత్సరం పూర్తిగా గడిచే లోపు దానిని విడిపించకపోతే, ప్రాకారం కలిగిన పట్టణంలోని ఇల్లు శాశ్వతంగా కొనుగోలుదారునికి, అతని వారసులకు చెందుతుంది. ఇది యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడదు. 31కానీ వారి చుట్టూ ఉన్న ప్రాకారాలు లేని గ్రామాల్లోని ఇల్లు బహిరంగ దేశానికి చెందినవిగా పరిగణించాలి. అవి విడిపించబడవచ్చు, అవి యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడాలి.
32“ ‘లేవీయులకు శాశ్వతంగా తమ దగ్గర ఉన్న లేవీయ పట్టణాల్లో తమ ఇళ్ళను విడిపించుకునే హక్కు ఉంటుంది. 33కాబట్టి లేవీయుల ఆస్తి విడిపించదగినది అంటే, వారి ఇల్లు ఏ పట్టణంలో అమ్మబడినా యాభైయవ వార్షికోత్సవంలో, తిరిగి ఇవ్వబడాలి, ఎందుకంటే లేవీయుల పట్టణాలలోని ఇల్లు ఇశ్రాయేలీయుల మధ్యలో వారి ఆస్తి. 34కానీ వారి పట్టణాలకు చెందిన పచ్చికబయళ్లు అమ్మకూడదు; అది వారి శాశ్వత స్వాస్థ్యము.
35“ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి, మీలో తమను తాము ఆదరించుకోలేకపోతే, మీరు ఒక విదేశీయునికి, అపరిచితునికి చేసినట్టుగానే వారికి సహాయం చేయండి, కాబట్టి వారు మీ మధ్య జీవించడం కొనసాగించవచ్చు. 36వారి నుండి వడ్డీ లేదా లాభం తీసుకోకండి, అయితే మీ దేవునికి భయపడండి, తద్వారా వారు మీ మధ్యనే జీవించడం కొనసాగించవచ్చు. 37మీరు వారికి వడ్డీకి డబ్బు ఇవ్వకూడదు లేదా లాభం కోసం ఆహారాన్ని అమ్మకూడదు. 38మీకు కనాను దేశాన్ని ఇచ్చి, నేను మీకు దేవుడనై ఉండాలని మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
39“ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి తమను తాము మీకు అమ్ముకున్నట్లయితే, వారితో బానిసలుగా పని చేయించవద్దు. 40వారిని మీ మధ్య జీతగాలుగా లేదా తాత్కాలిక నివాసితులుగా పరిగణించాలి; యాభైయవ వార్షికోత్సవం వరకు, వారు మీ కోసం పని చేస్తారు. 41అప్పుడు వారు, వారి పిల్లలు విడవబడాలి, వారు తమ కుటుంబాల దగ్గరకు, వారి పూర్వికుల స్వాస్థ్యానికి వెళ్తారు. 42ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా సేవకులు, నేనే ఈజిప్టు నుండి వారిని బయటకు తీసుకువచ్చాను, బానిసలుగా వారు అమ్మబడకూడదు. 43వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి.
44“ ‘మీ చుట్టూ ఉన్న జనాంగాలలో నుండి దాసులు, దాసీలు రావాలి; వారి నుండి బానిసలను కొనవచ్చు. 45మీ మధ్యనున్న తాత్కాలిక నివాసులు, మీ దేశంలో పుట్టిన వారి కుటుంబాల సభ్యులను మీరు కొనవచ్చు. వారు మీ సొత్తవుతారు. 46మీరు వారిని మీ పిల్లలకు వారసత్వపు ఆస్తిగా ఇవ్వవచ్చు, వారిని జీవితకాల బానిసలుగా చేయవచ్చు, కానీ మీరు మీ తోటి ఇశ్రాయేలీయులను కఠినంగా పాలించకూడదు.
47“ ‘మీ మధ్య నివాసమున్న పరదేశి ధనవంతుడైతే, అతని దగ్గర ఉన్న మీ స్వదేశీయుడు బీదవాడై ధనవంతుని లేదా అతని కుటుంబ సభ్యునికి అమ్ముడు పోతే, 48వారు తమను తాము అమ్మిన తర్వాత విడుదల హక్కును కలిగి ఉంటారు. వారి బంధువుల్లో ఒకరు వారిని విడిపించవచ్చు: 49మామ లేదా ఒక బంధువు లేదా వారి కుటుంబంలోని రక్తసంబంధి ఎవరైనా వారిని విడిపించవచ్చు. లేదా వారు అభివృద్ధి చెందితే, వారు తమను తాము విడిపించుకోవచ్చు. 50వారు, వారిని కొనుక్కున్న వ్యక్తి కలిసి అమ్ముడు పోయిన సంవత్సరం నుండి యాభైయవ వార్షికోత్సవం వరకు మిగతా కాలమెంతో లెక్కించాలి. వారి విడుదల యొక్క వెల ఆ సంవత్సరాల లెక్కను బట్టి, జీతగాని వెల ప్రకారం ఉంటుంది. 51ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉంటే, వాటి ప్రకారం తమను అమ్ముకున్న వెలలో ఎక్కువ వంతు తమ విడుదలకు మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది. 52యాభైయవ వార్షికోత్సవం వరకు మిగతా సంవత్సరాలు కొన్ని మాత్రమే ఉంటే తమ లెక్క చూసుకొని వారి విడుదల వెల చెల్లించాలి. 53వారిని జీతగాల్లలా ప్రతి సంవత్సరం పరిగణించాలి; వారు ఎవరికైతే సేవ చేస్తారో వారు, కఠినంగా వ్యవహరించకుండా మీరు చూసుకోవాలి.
54“ ‘ఒకవేళ ఈ విధానాల్లో ఎవరైనా విడిపించబడకపోయినా, వారు, వారి పిల్లలు యాభైయవ వార్షికోత్సవంలో విడిపించబడాలి, 55ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా దాసులుగా ఉన్నారు, నేను ఈజిప్టు దేశం నుండి వారిని తీసుకువచ్చిన నా దాసులు. నేను మీ దేవుడనైన యెహోవాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయ 25: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: