లేవీయ 3
3
సమాధానబలి
1“ ‘ఒకవేళ మీ అర్పణ సమాధానబలి అయితే, పశువుల్లో మగదానిని గాని, ఆడదానిని గాని, ఏ లోపం లేని దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి. 2మీరు అర్పించిన పశువు మీద చేయి ఉంచి, సమావేశ గుడారపు ద్వారం దగ్గర దానిని వధించాలి. యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చిలకరించాలి. 3సమాధానబలి అర్పణ నుండి మీరు యెహోవాకు హోమబలిని తీసుకురావాలి: లోపలి అవయవాలు, వాటికి ఉన్న సమస్త క్రొవ్వు, 4రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మీరు మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి. 5అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పుపై పేర్చిన కట్టెల మీద ఉన్న దహనబలితో పాటు వీటిని దహించాలి; అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
6“ ‘ఒకవేళ మీరు మంద నుండి ఒక పశువును సమాధానబలిగా యెహోవాకు అర్పిస్తే, మగదైనా ఆడదైనా మీరు లోపం లేనిదే అర్పించాలి. 7ఒకవేళ మీరు గొర్రెపిల్లను అర్పిస్తే, దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి. 8మీరు దాని తలపై చేయి ఉంచి సమావేశ గుడారం ముందు దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూరా దాని రక్తం చల్లాలి. 9సమాధానబలి నుండి మీరు యెహోవాకు హోమబలిని తీసుకురావాలి: ఆ బలి పశువు క్రొవ్వునూ, వెన్నెముక చివర వరకు ఉండే క్రొవ్వు పట్టిన తోకంతటిని, దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న క్రొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే క్రొవ్వునూ పూర్తిగా తీసుకురావాలి, 10రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి. 11యాజకుడు వాటిని బలిపీఠం మీద యెహోవాకు హోమబలిగా దహించాలి.
12“ ‘ఒకవేళ మీరు మేకను అర్పించాలంటే, దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి. 13మీరు దాని తలమీద చేయి పెట్టి సమావేశ గుడారం ముందు దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూరా దాని రక్తం చల్లాలి. 14మీరు అర్పించే దాని నుండి హోమబలి యెహోవా ఎదుట సమర్పించాలి: లోపలి అవయవాలు వాటి మీద ఉన్న కొవ్వంతా. 15రెండు మూత్రపిండాలు నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి. 16యాజకుడు వాటిని హోమబలిగా యెహోవాకు ఇష్టమైన సువాసనగల అర్పణగా బలిపీఠం మీద కాల్చివేయాలి. కొవ్వంతా యెహోవాదే.
17“ ‘మీరెక్కడ ఉన్నాసరే క్రొవ్వును గాని రక్తాన్ని గాని అసలు తినకూడదు. ఇది మీ రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.’ ”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయ 3: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: