లేవీయ 5
5
1“ ‘ఒకవేళ ఎవరైనా ఒట్టు పెట్టుకోవడం వల్ల తాము చూసిన దాని గురించి గాని తమకు తెలిసిన దాని గురించి గాని నిజం చెప్పాల్సి ఉండి దాని గురించి వారు మాట్లాడకుండా పాపం చేస్తే, దానికి వారే శిక్షను భరిస్తారు.
2“ ‘ఒకవేళ ఎవరైనా తాము అపరాధులని తెలుసుకుంటే పొరపాటున ఆచారరీత్య అపవిత్రమైన దానిని తాకితే (అపవిత్రమైన జంతువు కళేబరం, అది అడవిదైనా పెంపుడుదైనా, లేదా భూమి మీద ప్రాకే జీవియైనా కావచ్చు), వారు అపవిత్రులయ్యారు అని వారికి అవగాహన లేకపోతే, తర్వాత తాము గ్రహిస్తే, 3లేదా ఒకవేళ వారు పొరపాటున మనుష్యులను అపవిత్రం చేసే దేనినైనా తాకితే, దాని గురించి తెలుసుకున్నా తర్వాత వారు అపరాధులు అవుతారు, 4లేదా మనుష్యులెవరైనా అనాలోచితంగా మంచి గాని చెడు గాని చేస్తానని పొరపాటున ప్రమాణం చేసి, దాని గురించి తెలిసిన తర్వాత వారు అపరాధులు అని గ్రహిస్తారు. 5ఎవరైనా ఈ విషయాల్లో అపరాధులని గ్రహిస్తే, వారు ఏ విధంగా పాపం చేశారో అది ఒప్పుకోవాలి. 6వారు చేసిన పాపానికి జరిమానాగా, వారు మంద నుండి ఆడ గొర్రెపిల్ల లేదా మేకను పాపపరిహారబలిగా యెహోవా దగ్గరకు తీసుకురావాలి; యాజకుడు వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి.
7“ ‘గొర్రెపిల్లను కొనలేని వారెవరైనా వారి పాపానికి జరిమానాగా రెండు పావురాలు లేదా రెండు చిన్న గువ్వలను యెహోవా దగ్గరకు తీసుకురావాలి, వాటిలో ఒకటి పాపపరిహారబలి కోసం మరొకటి దహనబలి కోసము. 8అతడు వాటిని యాజకుడి దగ్గరకు తీసుకురావాలి, యాజకుడు మొదట పాపపరిహారబలి అర్పిస్తాడు. అతడు దాని తలను దాని మెడ నుండి పూర్తిగా వేరు చేయకుండ, మెలిపెట్టాలి, తల విరిచేయకూడదు, 9పాపపరిహారబలి యొక్క రక్తంలో కొంత భాగాన్ని బలిపీఠం వైపు చల్లాలి; మిగిలిన రక్తం బలిపీఠం యొక్క అడుగు నుండి బయటకు పంపాలి. ఇది పాపపరిహారబలి. 10యాజకుడు మరొకదాన్ని నిర్ణీత విధానంలో దహనబలిగా అర్పించి, వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి, వారు క్షమించబడతారు.
11“ ‘అయితే, ఒకవేళ వారు రెండు పావురాలు లేదా రెండు గువ్వలను కొనలేకపోతే, వారు తమ పాపానికి బలిగా పాపపరిహారబలి కోసం ఒక ఓమెరు#5:11 అంటే, బహుశ 1.6 కి. గ్రా. లు నాణ్యమైన పిండి తీసుకురావాలి. వారు దానిపై ఒలీవనూనె గాని ధూపం గాని పెట్టకూడదు, ఎందుకంటే అది పాపపరిహారబలి. 12వారు దానిని యాజకుని దగ్గరకు తీసుకురావాలి, అతడు దానిలో ఒక చేతినిండ భాగాన్ని జ్ఞాపక భాగంగా తీసుకుని యెహోవాకు సమర్పించిన హోమబలుల పైన బలిపీఠం మీద కాల్చాలి. ఇది పాపపరిహారబలి. 13ఈ విధంగా యాజకుడు వారు చేసిన ఈ పాపాల్లో దేనికోసమైనా ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు. మిగిలిన అర్పణ, భోజనార్పణ మాదిరిగానే యాజకునికి చెందుతుంది.’ ”
అపరాధ బలి
14యెహోవా మోషేతో ఇలా అన్నారు: 15“యెహోవాకు చెందిన పరిశుద్ధమైన వాటిలో దేని విషయంలోనైనా, ఎవరైనా అనుకోకుండ పాపం చేసి ఎవరైనా యెహోవా పట్ల నమ్మకద్రోహులైతే, వారు మంద నుండి లోపం లేని, పరిశుద్ధాలయం యొక్క షెకెల్#5:15 అంటే, 12 గ్రాములు ప్రకారం, వెండిలో సరియైన విలువగల ఒక పొట్టేలును ప్రాయశ్చిత్తంగా తీసుకురావాలి. ఇది అపరాధపరిహారబలి. 16ఆ వ్యక్తి పవిత్ర పదార్థం విషయంలో తప్పిదం చేసినందుకు, అధనంగా దాని విలువలో అయిదవ వంతు నష్టపరిహారం చెల్లించి అదంతా యాజకునికి ఇవ్వాలి. యాజకుడు పొట్టేలును అపరాధపరిహారబలిగా వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
17“ఎవరైనా పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేసినప్పుడు, అది వారికి తెలియకపోయినా సరే, వారు అపరాధులు, కాబట్టి వారు శిక్ష భరిస్తారు. 18వారు మంద నుండి అపరాధపరిహారబలిగా, ఒక లోపం లేని, సరియైన విలువగల పొట్టేలును యాజకుని దగ్గరకు తీసుకురావాలి. ఈ విధంగా యాజకుడు వారు అనుకోకుండ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు. 19ఇది అపరాధ పరిహారార్థబలి; అతడు యెహోవాకు విరోధంగా తప్పు చేసినందుకు అపరాధి అయ్యాడు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయ 5: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: