మార్కు సువార్త 12:28-34

మార్కు సువార్త 12:28-34 OTSA

ధర్మశాస్త్ర ఉపదేశకులలో ఒకడు వచ్చి వారు తర్కించుకోవడం విన్నాడు. యేసు వారికి మంచి జవాబు ఇవ్వడం గమనించి, “ఆజ్ఞలన్నిటిలో అతి ముఖ్యమైనదేది?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “అన్నిటిలో అతి ముఖ్యమైనది: ‘ఓ ఇశ్రాయేలీయులారా, వినండి: మన ప్రభువైన దేవుడు, ప్రభువు ఒక్కరే. మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణబలంతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’ రెండవ ఆజ్ఞ: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’ వీటిని మించిన గొప్ప ఆజ్ఞ లేదు” అని అతనితో చెప్పారు. అతడు, “బోధకుడా, బాగా చెప్పావు. దేవుడు ఒక్కరే, ఆయన తప్ప వేరొకరు లేరని నీవు చెప్పింది నిజమే. మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణవివేకంతో, మీ పూర్ణబలంతో ఆయనను ప్రేమించాలి, మీకులా మీ పొరుగువారిని ప్రేమించడం దహనబలులు అర్పణల కంటే ముఖ్యం” అని జవాబిచ్చాడు. అతడు తెలివిగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అని అతనితో చెప్పారు. ఆ తర్వాత ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.