సంఖ్యా 4
4
కహాతీయులు
1యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పారు: 2“లేవీ గోత్రంలో కహాతు వంశాల, కుటుంబాల ప్రకారం జనాభా లెక్కలు తీసుకోండి. 3సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సున్న పురుషులందరినీ లెక్కించు.
4“కహాతీయులు సమావేశ గుడారంలో చేయాల్సిన పని: అతిపరిశుద్ధమైనవాటిని జాగ్రత్తగా చూసుకోవడము. 5ప్రజలు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వెళ్లి అడ్డతెర దించి నిబంధన మందసం మీద కప్పాలి. 6తర్వాత వారు ఆ తెరను మన్నికైన తోలుతో#4:6 బహుశ పాలిచ్చే పెద్ద నీటి జంతువుల తోళ్ళు; 8, 10, 11, 12, 14, 25 వచనాల్లో కూడా ఉంది. కప్పి, దానిపై నీలిరంగు బట్ట పరిచి మోతకర్రలను వాటి ఉంగరాల్లో దూర్చాలి.
7“వారు సన్నిధి బల్లమీద నీలిరంగు బట్టను పరిచి దాని మీద పళ్లాలను, పాత్రలు, గిన్నెలు, పానార్పణ కోసం జాడీలను ఉంచాలి; రొట్టె ఎప్పుడూ దాని మీద ఉండాలి. 8వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి, మన్నికైన తోలుతో దాన్ని కప్పి, మోతకర్రలను ఉంగరాల్లో దూర్చాలి.
9“వారు నీలిరంగు బట్ట తీసుకుని దీపస్తంభాన్ని, దాని దీపాలను, వత్తులు కత్తిరించే కత్తెరలను, వాటి పళ్లాలను, దీపాల్లో పోసే ఒలీవనూనె జాడీలన్నిటిని కప్పాలి. 10తర్వాత వారు దానిని, దాని ఉపకరణాలన్నిటిని మన్నికైన తోలుతో చుట్టి మోసుకెళ్లే పలక మీద ఉంచాలి.
11“బంగారు బలిపీఠం మీద వారు నీలిరంగు బట్ట పరిచి, దాన్ని మన్నికైన తోలుతో కప్పి, మోతకర్రలను వాటి ఉంగరాల్లో దూర్చాలి.
12“వారు పరిశుద్ధాలయంలో పరిచర్య కోసం వాడే వస్తువులన్నిటిని తీసుకుని వాటిని నీలి బట్టలో చుట్టి, మన్నికైన తోలుతో కప్పి మోసుకెళ్లే పలక మీద ఉంచాలి.
13“వారు ఇత్తడి బలిపీఠం మీది నుండి బూడిదను తీసివేసి, దాని మీద ఊదా బట్ట కప్పాలి. 14తర్వాత వారు బలిపీఠం దగ్గర పరిచర్యకు వాడే అన్ని పాత్రలను, నిప్పు పెనాలు, ముళ్ళ గరిటెలు, పారలు, ప్రోక్షణ గిన్నెలతో సహా దాని మీద పెట్టాలి. దాని మీద మన్నికైన తోలు కప్పి, మోతకర్రలను వాటి స్థలంలో దూర్చాలి.
15“అహరోను అతని కుమారులు పరిశుద్ధ సామాగ్రి, పరిశుద్ధ ఉపకరణాలన్నిటిని కప్పడం పూర్తి చేసిన తర్వాత, ప్రజలు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కహాతీయులు వచ్చి దానిని మోయాలి. అయితే వారు పరిశుద్ధమైన వాటిని ముట్టకూడదు, ముట్టుకుంటే వారు చస్తారు. కహాతీయులు సమావేశ గుడారంలో ఉన్నవాటిని మోయాలి.
16“అహరోను కుమారుడును యాజకుడునైన ఎలియాజరు, దీపానికి నూనె, పరిమళ వాసనగల ధూపద్రవ్యం, నిత్యం అర్పించే భోజనార్పణ, అభిషేక తైలం మొదలగువాటిని పర్యవేక్షిస్తాడు. అతడు సమావేశ గుడారమంతటిని, అందులో ఉన్న సామాగ్రిని, పరిశుద్ధ ఉపకరణాలతో పాటు ప్రతిదీ పర్యవేక్షిస్తాడు.”
17యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు, 18“లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశం నాశనమై పోకుండా చూడండి. 19వారు అతిపరిశుద్ధమైన వాటి దగ్గరకు వచ్చినప్పుడు చావకుండ బ్రతికి ఉండేలా మీరు వారి కోసం ఇలా చేయండి: అహరోను అతని కుమారులు పరిశుద్ధాలయంలోకి వెళ్లి, వారందరికి వారు చేయాల్సిన పనిని, వారు మోయాల్సిన వాటిని వారికి అప్పగించాలి. 20అయితే కహాతీయులు పరిశుద్ధమైన వాటిని చూడాలని, కనీసం ఒక్క క్షణమైనా లోనికి వెళ్లకూడదు, వెళ్తే వారు చస్తారు.”
గెర్షోనీయులు
21యెహోవా మోషేతో ఇలా అన్నారు, 22“గెర్షోనీయులను కూడా వారి కుటుంబాలు, వంశాల ప్రకారం జనాభా లెక్కలు తీసుకోండి. 23సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సుగల పురుషులందరినీ లెక్కించండి.
24“మోయడంలో, అలాగే వారి ఇతర పనులలో గెర్షోను వంశస్థుల సేవ ఇదే: 25ప్రత్యక్ష గుడారం యొక్క తెరలు అంటే సమావేశ గుడారం దాని కప్పు అలాగే మన్నికైన తోలుతో చేయబడిన వెలుపటి కప్పు ఇంకా సమావేశ గుడార ద్వారం యొక్క తెరలు, 26సమావేశ గుడారం, బలిపీఠం చుట్టూ ఉన్న ఆవరణ తెరలు, ఆవరణ ప్రవేశ ద్వారపు తెరలు, వాటి త్రాళ్లు గుడారంలో సేవకు ఉపయోగించే వస్తువులన్నిటిని మోయాలి. వీటితో చేయాల్సిన పనులన్నీ గెర్షోనీయులు చేయాలి. 27గెర్షోనీయులు మోసుకెళ్లే పనైనా లేదా వేరే పనైనా వారి సేవ అంతా అహరోను అతని కుమారుల ఆధ్వర్యంలోనే జరగాలి. వారు మోయాల్సిన బాధ్యతను మీరు వారికి అప్పగించాలి. 28సమావేశ గుడారం దగ్గర గెర్షోను వంశస్థులు చేయాల్సిన సేవ ఇదే. వారి విధులను అహరోను కుమారుడును యాజకుడునైన ఈతామారు పర్యవేక్షణలో జరగాలి.
మెరారీయులు
29“మెరారీయుల కుటుంబాలను వారి వంశాల ప్రకారం జనాభా లెక్క తీసుకోండి. 30సమావేశ గుడారంలో పని చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల వయస్సుగల పురుషులందరినీ లెక్కించండి. 31గుడారంలో వారి సేవలో భాగంగా వారు గుడారపు పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, 32అంతేకాక, ఆవరణం చుట్టూ ఉండే స్తంభాలు వాటి దిమ్మలు, మేకులు, త్రాళ్లు వాటికి సంబంధించినవన్నీ వారే మోయాలి. ప్రతి ఒక్కరు మోయడానికి నిర్దిష్టమైన వాటిని అప్పగించండి. 33సమావేశ గుడారం దగ్గర అహరోను కుమారుడు, యాజకుడైన ఈతామారు పర్యవేక్షణలో మెరారి వంశస్థులు చేసే సేవ ఇది.”
లేవీ వంశస్థుల జనాభా లెక్క
34మోషే, అహరోనులు సమాజ నాయకులతో కలిసి కహాతీయులను వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం లెక్కించారు.
35-36వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులంతా 2,750 మంది. 37సమావేశ గుడారం దగ్గర సేవచేసే కహాతు వంశాల మొత్తం లెక్క ఇది. యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు వారిని లెక్కించారు.
38గెర్షోనీయులు వారి వంశాలు, కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు.
39-40వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి, సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులందరు 2,630 మంది. 41సమావేశ గుడారం దగ్గర సేవ చేసిన గెర్షోను వంశాల మొత్తం లెక్క ఇది. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు వారిని లెక్కించారు.
42మెరారీయులు వారి వంశాలు కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు.
43-44వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులందరు 3,200 మంది. 45మెరారి వంశాల మొత్తం లెక్క ఇది. మోషే ద్వారా వచ్చిన యెహోవా ఆజ్ఞమేరకు మోషే అహరోనులు వారిని లెక్కించారు.
46మోషే, అహరోను ఇశ్రాయేలు నాయకులు కలిసి లేవీయులందరిని వంశాల, కుటుంబాల ప్రకారం లెక్కించారు. 47వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి దాన్ని మోయడానికి వచ్చిన వారి 48సంఖ్య 8,580. 49మోషే ద్వార వచ్చిన యెహోవా ఆజ్ఞ ప్రకారం, వారందరికి వారి వారి పనులు, వారు మోయాల్సినవి అప్పగించబడ్డాయి.
యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, వారు లెక్కించబడ్డారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యా 4: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: