సామెతలు 1
1
ఉద్దేశ్యం అంశం
1దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు:
2జ్ఞానాన్ని ఉపదేశాన్ని పొందడం కోసం;
అంతరార్థంతో కూడిన పదాలను గ్రహించడం కోసం;
3వివేకంతో కూడిన ప్రవర్తన కోసం,
సరియైనది, న్యాయమైనది చేయడానికి ఉపదేశం పొందడం కోసం;
4సామాన్యులకు#1:4 సామాన్యులకు సామెతల గ్రంథంలో, హెబ్రీలో ఉపయోగించబడిన పదం నైతిక దిశ లేకుండా, చెడు వైపు మొగ్గు చూపే, తెలివితక్కువ వ్యక్తిని సూచిస్తుంది. బుద్ధి కలిగించడం కోసం,
యవ్వనస్థులకు తెలివి వివేకం కలిగించడం కోసం,
5జ్ఞానులు ఈ సామెతలు వింటారు, మరింత తెలివైనవారవుతారు,
వివేకంగలవారు ఉపదేశం పొందుకుంటారు.
6వారు సామెతలు, నీతికథలు,
జ్ఞానుల సూక్తులు, చిక్కుప్రశ్నలను గ్రహిస్తారు.
7యెహోవాయందు భయం తెలివికి మూలం,
అయితే మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తృణీకరిస్తారు.
ముందుమాట: జ్ఞానాన్ని హత్తుకోమని హెచ్చరికలు
పాపిష్ఠి మనుష్యుల ఆహ్వానానికి వ్యతిరేకంగా హెచ్చరిక
8నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని విను
నీ తల్లి బోధను త్రోసివేయవద్దు.
9అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా
నీ మెడను అలంకరించే హారంగా ఉంటాయి.
10నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే,
నీవు వారికి లొంగిపోవద్దు.
11ఒకవేళ వారు, “మాతో కూడా రా;
నిర్దోషుల రక్తాన్ని చిందించడానికి దాగి ఉందాం;
హాని చేయని ప్రాణం మీద ఆకస్మిక దాడి చేద్దాం;
12పాతాళం వలె మనుష్యులు జీవించి ఉండగానే వారిని పూర్తిగా మ్రింగివేద్దాం,
సమాధిలోనికి దిగువారి వలె పూర్ణబలంతో ఉండగానే వారిని మ్రింగివేద్దాం;
13అన్ని రకాల విలువైన వస్తువులు మనం తెచ్చి
మన ఇళ్ళను దోపుడు సొమ్ముతో నింపుకొందాం;
14మాతో చీట్లు వేయండి;
మనం దొంగిలించిన దానిని మనమందరం పంచుకుందాము.”
15నా పిల్లలారా, వారితో కలిసి వెళ్లకండి,
వారి దారుల్లో నీ పాదాలు పెట్టకు;
16కీడు చేయడానికి వారి పాదాలు పరుగెత్తుతాయి,
మనుష్యులను చంపడానికి త్వరపడతారు.
17రెక్కలు గల పక్షులు చూస్తుండగా
వల వేయడం నిష్ప్రయోజనం!
18అయితే ఈ మనుష్యులు తమ నాశనానికే పొంచి ఉంటారు;
తమ ప్రాణాన్ని తామే తీసుకోవడానికి వారు దాక్కొని ఉంటారు!
19అక్రమ సంపాదన వెంటపడే వారందరి దారులు అలాంటివే;
అది దానిని సొంతం చేసుకున్న వారి ప్రాణాలు తీస్తుంది.
జ్ఞానం యొక్క మందలింపు
20జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తున్నది,
అది బహిరంగ స్థలాల్లో తన గొంతు గట్టిగా వినిపిస్తుంది;
21అధిక రద్దీ ఉండే వీధి చివర్లలో అది కేక వేస్తుంది,
పట్టణ ద్వారాల దగ్గర ఆమె తన ప్రసంగం చేస్తుంది:
22“బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనుని మార్గాలను ప్రేమిస్తారు?
ఎగతాళి చేసేవారు ఎన్నాళ్ళు ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు?
బుద్ధిహీనులు ఎన్నాళ్ళు తెలివిని అసహ్యించుకుంటారు?
23నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి!
అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను,
నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను.
24కానీ నేను పిలిచినప్పుడు మీరు వినడానికి నిరాకరించినందున
నేను నా చేయి చాచినప్పుడు ఎవరూ పట్టించుకోనందున,
25మీరు నా సలహాను లెక్కచేయనందున
నా గద్దింపును అంగీకరించనందున,
26ఆపద మిమ్మల్ని తాకినప్పుడు నేను నవ్వుతాను;
విపత్తు మిమ్మల్ని అధిగమించినప్పుడు నేను ఎగతాళి చేస్తాను,
27విపత్తు తుఫానులా మిమ్మల్ని అధిగమించినప్పుడు,
ఆపద మిమ్మల్ని తుఫానులా ముంచినప్పుడు,
మీకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎగతాళి చేస్తాను.
28“అప్పుడు వారు నాకు మొరపెడతారు కాని నేను జవాబు ఇవ్వను;
నా కోసం ఆతురతగా వెదకుతారు కాని నేను కనబడను,
29వారు జ్ఞానాన్ని అసహ్యించుకున్నారు,
యెహోవాకు భయపడాలని వారు కోరలేదు కాబట్టి.
30వారు నా సలహాను అంగీకరించలేదు
నా గద్దింపును కూడా త్రోసివేశారు కాబట్టి,
31వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు
వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు.
32మూర్ఖులు దారితప్పడం వల్ల నశిస్తారు,
బుద్ధిహీనుల నిర్లక్ష్యం వారిని నాశనం చేస్తుంది;
33నా మాటలను వినేవారు క్షేమంగా నివసిస్తారు;
కీడు కలుగుతుందనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 1: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: