సామెతలు 3
3
జ్ఞానం క్షేమాన్ని కలిగిస్తుంది
1నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోవద్దు,
నా ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరచుకో,
2అవి నీ జీవితకాలాన్ని అనేక సంవత్సరాలు పొడిగిస్తాయి,
నీకు సమాధానాన్ని వృద్ధిని కలిగిస్తాయి.
3ప్రేమ, నమ్మకత్వం ఎన్నడు నిన్ను విడచిపోనివ్వకు;
నీ మెడలో వాటిని ధరించుకో,
నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకో.
4అప్పుడు నీవు దేవుని దృష్టిలోను మనుష్యుల దృష్టిలోను
దయపొంది మంచివాడవని అనిపించుకుంటావు.
5నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు
నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు;
6నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు,
అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు.
7నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు;
యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు.
8అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం,
నీ ఎముకలకు బలం కలుగుతుంది.
9నీ ధనముతో,
నీ పంటలో ప్రథమ ఫలముతో యెహోవాను ఘనపరచు;
10అప్పుడు నీ ధాన్యాగారాలు నిండి సమృద్ధిగా ఉంటాయి,
నీ గానుగ తొట్టెలు క్రొత్త ద్రాక్షరసంతో పొంగిపొర్లుతాయి.
11నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు
ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు.
12ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు,
యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు.
13జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు,
వివేచన కలిగినవారు ధన్యులు.
14ఎందుకంటే ఆమె#3:14 ఆమె జ్ఞానాన్ని సూచిస్తుంది వెండి కంటే ఎక్కువ ప్రయోజనకరం,
ఆమె బంగారం కంటే ఎక్కువ లాభం తెస్తుంది.
15ఆమె పగడాలకంటే శ్రేష్ఠమైనది;
నీకు ఇష్టమైనవేవి ఆమెతో సమానం కావు.
16దాని కుడి చేతిలో దీర్ఘాయువు;
ఎడమ చేతిలో ఐశ్వర్యం ఘనతలు ఉన్నాయి.
17దాని మార్గాలు ఎంతో అనుకూలమైనవి
దాని త్రోవలన్ని సమాధానకరమైనవి.
18ఆమెను కలిగి ఉన్నవారికి అది జీవవృక్షం వంటిది;
దానిని స్థిరంగా పట్టుకుని ఉన్నవారు ధన్యులు.
19యెహోవా జ్ఞానం వలన భూమికి పునాదులు వేశారు,
ఆయన తెలివి వలన ఆకాశ విశాలాన్ని ఏర్పరిచారు;
20ఆయన తెలివి వలన అగాధజలాలు విభజించబడ్డాయి.
మేఘాల నుండి మంచు బిందువులు కురుస్తున్నాయి.
21నా కుమారుడా, జ్ఞానాన్ని వివేకాన్ని నీ దగ్గర భద్రంగా చూచుకో,
వాటిని నీ కళ్ళెదుట నుండి తొలగిపోనివ్వకు;
22అవి నీకు జీవంగా,
నీ మెడకు అలంకార ఆభరణంగా ఉంటాయి.
23అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు,
నీ పాదం తడబడదు.
24నీవు పడుకున్నప్పుడు, భయపడవు;
నీవు పడుకున్నప్పుడు, నీ నిద్ర మధురంగా ఉంటుంది.
25హఠాత్తుగా భయం కలిగినప్పుడు,
దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవు.
26యెహోవా నీ ప్రక్కన ఉంటారు,
నీ పాదాలు వలలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతారు.
27నీవు క్రియ చేయగల అధికారం నీవు కలిగి ఉన్నప్పుడు,
అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉండవద్దు.
28నీవు నీ పొరుగువానికి ఇప్పుడు సహాయం చేయ కలిగి ఉండి,
“రేపు రా నేను ప్రయత్నిస్తాను”
అని నీ పొరుగువానితో అనవద్దు.
29నీ పొరుగువారు నమ్మకంగా నీ దగ్గర జీవిస్తున్నప్పుడు
వారికి హాని తలపెట్టవద్దు.
30నీకు హాని చేయని మనుష్యులతో,
కారణం లేకుండా వాదించవద్దు.
31హింసాత్మకమైనవారిని అసూయ పడకు,
వారి మార్గాల్లో వేటిని నీవు ఎంచుకోవద్దు.
32మూర్ఖులు యెహోవాకు అసహ్యులు
కాని యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారు.
33దుర్మార్గుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుంది,
కాని నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదిస్తారు.
34ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు
కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు.
35జ్ఞానులు ఘనతను పొందుతారు,
మూర్ఖులు అవమానాన్ని పొందుతారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 3: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: