కీర్తనలు 115

115
కీర్తన 115
1మాకు కాదు, యెహోవా, మాకు కాదు,
మీ మారని ప్రేమ, నమ్మకత్వాన్ని బట్టి,
మీ నామానికే మహిమ కలగాలి.
2“వారి దేవుడు ఎక్కడ?”
అని జనులు ఎందుకు అంటున్నారు?
3మన దేవుడు పరలోకంలో ఉన్నారు;
ఆయనకు ఇష్టమైనదే ఆయన చేస్తారు.
4అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు,
అవి మనుష్యుల చేతిపనులు.
5వాటికి నోళ్ళున్నాయి, కాని మాట్లాడలేవు,
కళ్లున్నాయి, కాని చూడలేవు.
6వాటికి చెవులున్నాయి, కాని వినలేవు,
ముక్కులున్నాయి, కాని వాసన చూడలేవు.
7వారికి చేతులు ఉన్నాయి, కానీ అనుభూతి చెందవు,
పాదాలున్నాయి, కాని నడవలేవు,
కనీసం వాటి గొంతులతో శబ్దం చేయలేవు.
8వాటిని తయారుచేసేవారు,
వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు.
9సర్వ ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి
ఆయనే వారికి సహాయం డాలు.
10అహరోను వంశమా, యెహోవాను నమ్ముకోండి
ఆయనే వారికి సహాయం డాలు.
11యెహోవాకు భయపడు వారలారా ఆయనను నమ్ముకోండి
ఆయనే వారికి సహాయం డాలు.
12యెహోవా మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు మనల్ని దీవిస్తారు:
ఆయన ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తారు,
అహరోను వంశాన్ని దీవిస్తారు.
13యెహోవాకు భయపడేవారిని అనగా
పిల్లలను పెద్దలను ఆయన దీవిస్తారు.
14యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను,
వృద్ధి చేయును గాక.
15ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవాచేత,
మీరు దీవించబడుదురు గాక.
16ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి,
అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు.
17యెహోవాను స్తుతించేది చనిపోయినవారు కాదు,
నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లేవారు కాదు;
18మనమే యెహోవాను కీర్తించేవారం,
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము.
యెహోవాను స్తుతించండి.#115:18 హెబ్రీలో హల్లెలూయా

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 115: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి