కీర్తనలు 123

123
కీర్తన 123
యాత్రకీర్తన.
1పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా,
మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను.
2దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు,
దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు,
మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు
మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి.
3మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి,
ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము.
4మేము గర్విష్ఠుల
అంతులేని ఎగతాళిని,
అహంకారుల ధిక్కారాన్ని భరించాము.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 123: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి