కీర్తనలు 133

133
కీర్తన 133
దావీదు యాత్రకీర్తన
1సహోదరులు ఐక్యత కలిగి నివసించడం
ఎంత మేలు! ఎంత మనోహరం!
2అది అహరోను తలమీద పోయబడి
అతని గడ్డం మీదుగా కారుతూ,
వస్త్రపు అంచు వరకు కారిన
ప్రశస్తమైన తైలం వంటిది.
3అది సీయోను కొండలమీదికి దిగివచ్చే
హెర్మోను మంచులా ఉంటుంది.
యెహోవా తన ఆశీర్వాదాన్ని,
జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 133: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి