కీర్తనలు 135
135
కీర్తన 135
1యెహోవాను స్తుతించండి.#135:1 హెబ్రీలో హల్లెలూయా; 3, 21 వచనాల్లో వచనాల్లో కూడ
యెహోవా నామాన్ని స్తుతించండి;
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి,
2యెహోవా మందిరంలో, మన దేవుని మందిర ఆవరణాల్లో
సేవ చేసేవారలారా, ఆయనను స్తుతించండి.
3యెహోవా మంచివాడు కాబట్టి యెహోవాను స్తుతించండి;
ఆయన నామానికి స్తుతులు పాడండి, అది మనోహరమైనది.
4యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు.
ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు.
5యెహోవా గొప్పవాడని,
దేవుళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడని నాకు తెలుసు.
6ఆకాశాల్లో భూమిమీద,
సముద్రాల్లో జలాగాధాలలో,
యెహోవా తనకిష్టమైన దానిని జరిగిస్తారు.
7ఆయన భూమి అంచుల నుండి మేఘాలను లేచేలా చేస్తారు;
వర్షంతో పాటు మెరుపులను పంపిస్తారు
తన కోటలో నుండి గాలిని బయటకు పంపిస్తారు.
8ఈజిప్టులో మొదటి సంతానాన్ని ఆయన మొత్తారు,
మనుష్యుల పశువుల మొదటి సంతానాన్ని ఆయన హతం చేశారు.
9ఓ ఈజిప్టు, మీ మధ్యలో ఫరోకు, అతని సేవకులకు వ్యతిరేకంగా
ఆయన ఆశ్చర్యకార్యాలను అద్భుతాలను పంపారు.
10ఆయన అనేక జాతులను మొత్తారు
బలాఢ్యులైన రాజులను హతం చేశారు.
11అమోరీయుల రాజైన సీహోను,
బాషాను రాజైన ఓగు,
కనాను రాజులందరూ,
12ఆయన వారి దేశాన్ని వారసత్వంగా,
తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చారు.
13యెహోవా, మీ నామం నిత్యం ఉంటుంది.
యెహోవా, మీ కీర్తి తరతరాలులో నిలిచి ఉంటుంది.
14యెహోవా తన ప్రజలకు శిక్ష విముక్తి జరిగిస్తారు,
ఆయన సేవకులపై దయ కలిగి ఉంటారు.
15దేశాల విగ్రహాలు వెండి బంగారాలు,
అవి మనుష్యుల చేతిపనులు.
16వాటికి నోళ్ళున్నాయి కాని మాట్లాడలేవు,
కళ్లున్నాయి కాని చూడలేవు.
17చెవులున్నాయి కాని వినలేవు,
వాటి నోళ్లలో ఊపిరి ఏమాత్రం లేదు.
18వాటిని తయారుచేసేవారు, వాటిని నమ్మేవారు
వాటి లాగే ఉంటారు.
19ఓ ఇశ్రాయేలు గృహమా, యెహోవాను స్తుతించు;
ఓ అహరోను గృహమా, యెహోవాను స్తుతించు;
20ఓ లేవీ గృహమా, యెహోవాను స్తుతించు;
యెహోవాకు పట్ల భయము కలవారలారా, యెహోవాను స్తుతించండి.
21సీయోనులో నుండి యెహోవా స్తుతించబడును గాక,
ఆయన యెరూషలేములో నివసిస్తారు.
యెహోవాను స్తుతించండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 135: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: