కీర్తనలు 141
141
కీర్తన 141
దావీదు కీర్తన.
1యెహోవా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను,
నా దగ్గరకు త్వరగా రండి;
నా స్వరాన్ని ఆలకించండి.
2నా ప్రార్థన దూపమువలే మీకు అంగీకారమగును గాక;
నా చేతులు పైకెత్తడం సాయంకాల నైవేద్యంలా ఉండును గాక.
3యెహోవా నా నోటికి కావలి పెట్టండి;
నా పెదవులు వాకిట కావలి ఉంచండి.
4కీడు చేసేవారితో కలిసి
వారి దుష్ట క్రియలలో నేను పాల్గొనకుండునట్లు,
నా హృదయాన్ని చెడు వైపు తిరగనివ్వకండి;
వారి రుచిగల పదార్థాలు నేను తినకుండ ఉండనివ్వండి!
5నీతిమంతులు నన్ను కొట్టడం నామీద దయ చూపడమే;
వారు నన్ను మందలించడం నాకు తైలాభిషేకమే.
నా తల దానిని నిరాకరించదు,
కీడుచేసేవారి క్రియలకు విరుద్ధంగా నా ప్రార్థన మాత్రం మానను.
6వారి పాలకులు కొండలపై నుండి పడద్రోయబడతారు,
అప్పుడు వారు నా మాటలు నిజమని గ్రహిస్తారు.
7“ఒకరు భూమిలో దున్నినట్లు,
మా ఎముకలు మృత్యులోక ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి” అని వారంటారు.
8ప్రభువైన యెహోవా, మీ వైపే నేను చూస్తున్నాను;
మీయందు నేను ఆశ్రయించాను; నన్ను మరణానికి అప్పగించకండి.
9కీడుచేసేవారి ఉచ్చుల నుండి,
వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి.
10దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు,
నేనైతే తప్పించుకు వెళ్తాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 141: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: