కీర్తనలు 143
143
కీర్తన 143
దావీదు కీర్తన.
1యెహోవా, నా ప్రార్థన వినండి;
దయ కోసం నేను చేసే మొరను ఆలకించండి;
మీ నమ్మకత్వం నీతిని బట్టి
నాకు జవాబివ్వండి.
2మీ సేవకున్ని తీర్పులోనికి తీసుకురాకండి,
ఎందుకంటే సజీవులెవ్వరూ మీ దృష్టిలో నీతిమంతులు కారు.
3శత్రువు నన్ను వెంటాడుతున్నాడు,
అతడు నా జీవితాన్ని నలిపివేస్తాడు;
ఎప్పుడో చచ్చిన వారిలా
అతడు నన్ను చీకటిలో నివసించేలా చేస్తాడు.
4నా ఆత్మ నాలో సొమ్మసిల్లిపోయింది;
నా హృదయం నాలో బెదిరిపోయింది.
5వెనుకటి రోజులు జ్ఞాపకము చేసుకుంటున్నాను;
మీ క్రియలను గురించి ధ్యానిస్తున్నాను,
మీ చేతిపనిని గురించి ఆలోచిస్తాను.
6మీ వైవు నా చేతులు చాపుతున్నాను;
ఎండిపోయిన నేల వలె మీ కోసం దప్పిక కలిగి ఉన్నాను. సెలా
7యెహోవా, నాకు త్వరగా జవాబివ్వండి;
ఆత్మ నీరసించి పోతూ ఉంది.
మీ ముఖాన్ని మరుగు చేయకండి,
లేకపోతే గొయ్యిలో దిగిపోయిన వారిలా నేనుంటాను.
8నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి,
ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక.
నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను,
నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.
9నా కాపుదల కోసం మీ దగ్గరకు పరుగెత్తుతున్నాను,
యెహోవా నా శత్రువుల నుండి నన్ను రక్షించండి.
10మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి,
మీరు నా దేవుడు;
మీ మంచి ఆత్మ
సమతల నేల మీద నన్ను నడిపించును గాక.
11యెహోవా, మీ పేరు కోసం నా జీవితాన్ని కాపాడండి;
మీ నీతిలో నా కష్టాల నుండి నన్ను విడిపించండి.
12మీ మారని ప్రేమను బట్టి నా శత్రువులను మౌనం చేయండి;
నేను మీ సేవకుని కాబట్టి,
నా శత్రువులను నాశనం చేయండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 143: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: