కీర్తనలు 49
49
కీర్తన 49
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన.
1సర్వజనులారా, ఈ విషయం వినండి;
సర్వ లోకవాసులారా, ఆలకించండి,
2సామాన్యులారా, గొప్పవారలారా
ధనికులారా పేదలారా అందరు వినండి:
3నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది;
నా హృదయ ధ్యానం మీకు అవగాహన ఇస్తుంది.
4నేను నా చెవిని సామెత వైపు త్రిప్పుతాను
వీణతో నేను నా పొడుపు కథను విప్పుతాను:
5దుర్దినాలు వచ్చినప్పుడు, నా శత్రువుల పాపం
నన్ను చుట్టుముట్టినప్పుడు నేనెందుకు భయపడాలి?
6వారు తమ సంపదను నమ్మి,
తమ ఐశ్వర్యాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటారు.
7ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు
వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు.
8-9వారు కుళ్లు చూడక,
నిత్యం బ్రతకాలంటే
వారి ప్రాణ విమోచన వెల చాలా ఎక్కువ
అది ఎన్నటికి చెల్లించబడలేదు.
10తమ సంపదను ఇతరులకు వదిలేసి
జ్ఞానులు చనిపోవడం,
మూర్ఖులు తెలివిలేనివారు నశించడం అందరు చూస్తారు.
11వారు తమ భూములకు తమ పేర్లే పెట్టుకున్నప్పటికి
సమాధే వారి నిత్య నివాసము
అక్కడే వారు నిత్యం నివసిస్తారు.
12మనుష్యులు ఎంత సంపద ఉన్నా నశించకుండ ఉండలేరు;
నశించే జంతువుల్లా వారు ఉన్నారు.
13తమను తాము నమ్ముకొనే బుద్ధిహీనులకు,
వారు చెప్పేది వింటూ వారిని అనుసరించేవారికి ఇదే గతి. సెలా
14వారు గొర్రెల్లా ఉండి మరణానికి నడిపించబడతారు;
మరణమే వారికి కాపరి.
యథార్థవంతులు ఉదయం వారిని పరిపాలిస్తారు.
వారి రాజభవనాలకు దూరంగా,
సమాధిలో వారి మృతదేహాలు కుళ్ళిపోతాయి.
15కానీ దేవుడు పాతాళం నుండి నన్ను విడిపిస్తారు;
ఆయన తప్పకుండ నన్ను తన దగ్గరకు తీసుకెళ్తారు. సెలా
16కాబట్టి ఇతరులు ధనవంతులుగా ఎదిగినప్పుడు,
వారి ఇండ్ల వైభవం అధికమైనప్పుడు భయపడవద్దు.
17ఎందుకంటే వారు చనిపోయినప్పుడు వారు తమతో ఏమీ తీసుకెళ్లరు,
వారి వైభవం వారి వెంట దిగిపోదు.
18వారు బ్రతికి ఉన్నప్పుడు ఆశీర్వదింపబడిన వారిగా తమను తాము పిలుచుకున్నా,
వారు అభివృద్ధి చెందినప్పుడు ప్రజలు వారిని పొగిడినా,
19వారు తమకంటే ముందుగా వెళ్లిపోయినవారిని చేరుకుంటారు,
వారు మరి ఎన్నడూ జీవపు వెలుగును చూడరు.
20సంపద ఉండి వివేకంలేని మనుష్యులు
నశించే జంతువుల్లాంటి వారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 49: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: