కీర్తనలు 72
72
కీర్తన 72
సొలొమోను కీర్తన.
1ఓ దేవా, రాజుకు మీ న్యాయాన్ని,
రాకుమారునికి మీ నీతిని ప్రసాదించండి.
2ఆయన మీ ప్రజలకు నీతితో
బాధితులకు న్యాయంతో తీర్పు తీర్చును గాక.
3పర్వతాలు ప్రజలకు వృద్ధిని,
కొండలు నీతి ఫలములు ఇచ్చును గాక.
4ప్రజల్లో బాధపడుతున్నవారిని ఆయన రక్షించును గాక
అవసరతలో ఉన్న వారి పిల్లలను రక్షించును గాక;
బాధించేవారిని త్రొక్కివేయును గాక.
5సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం,
అన్ని తరాల వరకు వారు ఆయనకు భయపడుదురు గాక.
6ఆయన కోయబడిన తుక్కుపై కురిసే వర్షంలా,
భూమిని తడిపే నీటి జల్లులా ఉండును గాక.
7ఆయన రోజుల్లో నీతిమంతులు వృద్ధిచెందుతారు
చంద్రుడు లేకుండ పోయే వరకు అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది.
8సముద్రం నుండి సముద్రం వరకు,
యూఫ్రటీసు నుండి భూమ్యంతాల వరకు ఆయన పరిపాలిస్తారు.
9ఎడారిలో నివసించే ప్రజలు ఆయన ముందు తలవంచుతారు.
తన శత్రువులు మట్టిని నాకుతారు.
10తర్షీషు రాజులు దూర దేశపు రాజులు,
ఆయనకు పన్నులు చెల్లిస్తారు.
షేబ సెబా రాజులు
కానుకలు తెస్తారు.
11రాజులందరూ ఆయనకు నమస్కరించుదురు గాక
దేశాలన్నీ ఆయనకు సేవలు చేయును గాక.
12అవసరతలో ఉండి మొరపెట్టే వారిని,
సహాయపడడానికి ఎవరు లేని బాధితులను ఆయన విడిపిస్తారు.
13ఆయన బలహీనులపై పేదవారిపై జాలి చూపుతారు,
పేదవారిని మరణం నుండి రక్షిస్తారు.
14ఆయన వారిని అణచివేత నుండి హింస నుండి విడిపిస్తారు,
ఎందుకంటే ఆయన దృష్టిలో వారి రక్తం విలువైనది.
15రాజు దీర్ఘకాలం జీవించును గాక!
షేబ నుండి ఆయనకు బంగారం ఇవ్వబడును గాక.
ప్రజలు నిత్యం ఆయన కోసం ప్రార్థించుదురు గాక.
రోజంతా ఆయనను స్తుతించుదురు గాక.
16దేశం అంతటా ధాన్యం సమృద్ధిగా ఉండును గాక;
కొండల పైభాగాన అది ఆడించబడును గాక.
పండ్లచెట్లు లెబానోను చెట్లలా వర్ధిల్లును గాక
ప్రజలు పొలం లోని పచ్చికబయళ్లుగా వృద్ధి చెందును గాక.
17ఆయన పేరు నిరంతరం ఉండును గాక;
అది సూర్యుడు ఉండే వరకు కొనసాగును గాక.
అప్పుడు ఆయన ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయి,#72:17 లేదా ఆశీర్వాదాలలో ఆయన నామమును వాడుతారు ఆది 48:20
వారు ఆయనను ధన్యుడు అని పిలుస్తారు.
18ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవునికి స్తుతి,
ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తారు.
19ఆయన మహిమగల నామం సదాకాలం స్తుతింపబడును గాక;
భూమంతా ఆయన మహిమతో నింపబడును గాక.
ఆమేన్ ఆమేన్.
20దీనితో యెష్షయి కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిశాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 72: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

: