పరమ 7

7
1ఓ రాకుమారుని కుమార్తె!
చెప్పులతో మీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!
మీ అందమైన కాళ్లు ఆభరణాలు వంటివి,
నైపుణ్యం కలిగిన హస్తకళాకారుని పని.
2నీ నాభి గుండ్రని ఒక మద్యపాన పాత్ర
అందులో ద్రాక్షరస మిశ్రమం ఎప్పుడూ కొరతగా ఉండదు.
నీ నడుము తామరల చేత చుట్టబడిన
గోధుమ రాశిలాగ ఉంది.
3నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి,
దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి.
4నీ మెడ దంతపు గోపురం లాంటిది.
మీ కళ్లు బాత్-రబ్బీం ద్వారం దగ్గర ఉన్న
హెష్బోను కొలనులాంటివి.
మీ ముక్కు దమస్కు వైపు చూస్తున్న
లెబానోను గోపురం లాంటిది.
5నీ శిరస్సు కర్మెలు పర్వతము.
నీ శిరోజాలు రాజు ధరించే ఊదా వస్త్రంలా ఉన్నాయి;
వాటి చుట్టలో రాజు బందీగా పట్టుబడ్డాడు.
6నా ప్రియులారా, నీకు ఆనందకరమైన వాటితో,
నీవు ఎంత అందంగా ఉన్నావు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నావు.
7నీ రూపం తాటి చెట్టులా
నీ స్తనములు గెలల్లా ఉన్నాయి.
8నేనన్నాను, “నేను తాటి చెట్టు ఎక్కుతాను;
దాని ఫలములు పట్టుకుంటాను.”
నీ స్తనములు ద్రాక్షవల్లికి ఉండే ద్రాక్ష గెలల్లా ఉండును గాక.
నీ శ్వాస యొక్క పరిమళం ఆపిల్ పండ్ల వాసనలా ఉంది.
9నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షరసంలా ఉంది.
యువతి
ద్రాక్షరసం పెదవులు పళ్ల మీదుగా సున్నితంగా ప్రవహిస్తూ
నా ప్రియుని దగ్గరకు వెళ్లును గాక.
10నేను నా ప్రియుని దానను,
ఆయనకు నా పట్ల వాంఛ.
11నా ప్రియుడా, రా, మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాము,
గ్రామాల్లో#7:11 లేదా గోరింట పొదల్లో రాత్రి గడుపుదాము.
12ప్రొద్దున్నే లేచి, ద్రాక్ష తోటలకు వెళ్లిపోదాం
ద్రాక్షవల్లులు చిగిర్చాయేమో,
పూలు పూచాయేమో,
దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయేయో, చూద్దాము రా!
అక్కడ నా ప్రేమ నీకు వ్యక్తం చేస్తాను.
13పుత్రదాత ఫలం సువాసన ఇస్తున్నది,
నా ప్రియుడా, మా ద్వారబంధాల దగ్గరే అనేక రకాల శ్రేష్ఠఫలాలున్నాయి,
నీకోసం వాటిని దాచి వుంచాను,
క్రొత్తవి పాతవి అందులో ఉన్నాయి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

పరమ 7: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి