1 రాజులు 19:19
1 రాజులు 19:19 పవిత్ర బైబిల్ (TERV)
కావున ఏలీయా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాడు షాపాతు కుమారుడైన ఎలీషాను చూశాడు. ఎలీషా ఎద్దులను కట్టి 12 ఎకరాల పొలం దున్నుతున్నాడు. ఏలీయా వచ్చినప్పుడు ఎలీషా చివరి ఎకరాన్ని దున్నుచుండెను. ఏలీయా సరాసరి ఎలీషా వద్దకు వచ్చాడు. ఏలీయా తన అంగీని తీసి ఎలీషా మీద కప్పాడు.
1 రాజులు 19:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఏలీయా అక్కడ నుండి వెళ్లిన తరువాత అతనికి షాపాతు కొడుకు ఎలీషా కనిపించాడు. అతడు తన దగ్గరున్న పన్నెండు జతల ఎడ్లతో దుక్కి దున్నిస్తూ పన్నెండవ కాడి తానే తోలుతున్నాడు. ఏలీయా అతని దగ్గరికి వెళ్లి తన పైబట్టను అతని మీద వేశాడు.
1 రాజులు 19:19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేరబోయి తన దుప్పటి అతనిమీద వేయగా
1 రాజులు 19:19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి ఏలీయా అక్కడినుండి వెళ్లి, షాపాతు కుమారుడైన ఎలీషాను కనుగొన్నాడు. ఎలీషా పన్నెండు జతల ఎడ్లతో పొలం దున్నిస్తూ స్వయంగా అతడు పన్నెండవ జతను నడుపుతూ ఉన్నప్పుడు, ఏలీయా అతని దగ్గరకు వెళ్లి తన దుప్పటి తీసి అతని మీద వేశాడు.