1 పేతురు 2:24-25
1 పేతురు 2:24-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.
1 పేతురు 2:24-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మనం పాపం కొరకు మరణించి నీతికొరకు జీవించేలా ఆయన “మన పాపాలను తనపై ఉంచుకొని సిలువను మోసారు. ఆయన పొందిన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు. మీరు త్రోవ తప్పిన గొర్రెల్లా ఉన్నారు” కాని ఇప్పుడు మీ ఆత్మలకు పర్యవేక్షకుడు కాపరి అయిన వాని దగ్గరకు మీరు తిరిగి వచ్చారు.
1 పేతురు 2:24-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు. మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు.
1 పేతురు 2:24-25 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన మన పాపాలను సిలువపై భరించాడు. పాపం చేస్తూ జీవించటం మానుకున్న మనం నీతిగా జీవించాలని యిలా చేసాడు. ఆయన దెబ్బల ద్వారా మన రోగాలు మాని పోయాయి. ఎందుకంటే, ఇదివరలో మీరు దారి తప్పిన గొఱ్ఱెల్లా ప్రవర్తించారు. కాని యిప్పుడు మీరు, మీ ఆత్మల్ని కాపలా కాచే కాపరి, అధిపతి దగ్గరకు తిరిగి వచ్చారు.
1 పేతురు 2:24-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మనం పాపాల విషయంలో మరణించి నీతి కోసం జీవించేలా ఆయన, “మన పాపాలను తనపై ఉంచుకుని సిలువను మోసారు. ఆయన పొందిన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు. మీరు త్రోవ తప్పిన గొర్రెల్లా ఉన్నారు” కాని ఇప్పుడు మీ ఆత్మల సంరక్షకుడు కాపరియైన వాని దగ్గరకు మీరు తిరిగి వచ్చారు.