1 పేతురు 3:8-9
1 పేతురు 3:8-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గల వారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
1 పేతురు 3:8-9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
చివరిగా, మీరందరు, ఏక మనస్కులు, సానుభూతి కలవారై ఉండి, పరస్పరం ప్రేమ కలిగి కరుణ, వినయం కలవారై ఉండండి. కీడుకు ప్రతిగా కీడును, దూషణకు ప్రతిగా దూషణ చేయకండి, దానికి బదులుగా ఆశీర్వదించండి, ఎలాగంటే దేవుడు మిమ్మల్ని పిలిచినపుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఆశీర్వాదం.
1 పేతురు 3:8-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి. కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
1 పేతురు 3:8-9 పవిత్ర బైబిల్ (TERV)
చివరకు చెప్పేదేమిటంటే మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదరులవలే ప్రేమించుకుంటూ, నమ్రతగలవారై జీవించండి. అపకారం చేసిన వాళ్ళకు అపకారం చెయ్యకండి. అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంతటితో ఆగక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందుకంటే, దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు.
1 పేతురు 3:8-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
చివరిగా మీరందరు ఏక మనసు కలిగి సానుభూతి కలవారై పరస్పరం ప్రేమ కలిగి కరుణ, వినయంతో ఉండండి. కీడుకు ప్రతిగా కీడును, దూషణకు ప్రతిగా దూషణ చేయకండి. దానికి బదులుగా ఆశీర్వదించండి. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు.