1 తిమోతికి 2:5-6
1 తిమోతికి 2:5-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.
1 తిమోతికి 2:5-6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎందుకంటే, దేవుడు ఒక్కడే; క్రీస్తు యేసు ఒక్కడే మానవునిగా ఉండి, దేవునికి మానవులకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉన్నారు. ఆయనే ప్రజలందరి రక్షణ కొరకు విమోచన క్రయధనంగా తనను తాను అర్పించుకున్నారు. దీని గురించి సరియైన సమయంలో సాక్ష్యం ఇవ్వబడుతుంది.
1 తిమోతికి 2:5-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే మానవుడు. ఈయన అందరి కోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. సరైన సమయంలో దేవుడు దీన్ని ధృవీకరించాడు.
1 తిమోతికి 2:5-6 పవిత్ర బైబిల్ (TERV)
ఎందుకంటే ఒకే ఒక దేవుడున్నాడు. దేవునికి, మానవులకు మధ్య సంధి కుదుర్చటానికి ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే మానవునిగా జన్మించిన యేసు క్రీస్తు. ఆయన మానవులకు విమోచన కలిగించాలని సరియైన సమయానికి తనను తాను ఒక వెలగా అర్పించుకొన్నాడు. మానవులందరూ రక్షింపబడటమే దేవుని ఉద్దేశ్యమన్నదానికి యిది నిదర్శనము.
1 తిమోతికి 2:5-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఎందుకంటే, దేవుడు ఒక్కడే; క్రీస్తు యేసు ఒక్కడే మానవునిగా ఉండి, దేవునికి మానవులకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉన్నారు. ఆయనే ప్రజలందరి రక్షణ కోసం విమోచన క్రయధనంగా తనను తాను అర్పించుకున్నారు. దీని గురించి సరియైన సమయంలో సాక్ష్యం ఇవ్వబడుతుంది.