1 తిమోతికి 2:8-10
1 తిమోతికి 2:8-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశ యమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రములచేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలం కరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
1 తిమోతికి 2:8-10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక ప్రతిచోట పురుషులు పవిత్రమైన చేతులను పైకెత్తి, కోపం లేదా కలహభావం లేకుండా ప్రార్థించాలని నేను కోరుతున్నాను. అలాగే స్త్రీలు నిరాడంబరమైన, క్రమమైన వస్త్రధారణ చేసుకోవాలి, విస్తృతమైన కేశాలంకరణ లేదా బంగారం లేదా ముత్యాలు లేదా ఖరీదైన దుస్తులతో కాకుండ, దేవుని పట్ల భక్తి ఉందని అని చెప్పుకునే దానికి తగినట్లుగా మంచి పనులతో అలంకరించుకోవాలని కోరుతున్నాను.
1 తిమోతికి 2:8-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుచేత అన్ని స్థలాల్లోనూ పురుషులు ఆగ్రహం, తర్కవితర్కాలు లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి.
1 తిమోతికి 2:8-10 పవిత్ర బైబిల్ (TERV)
అన్ని స్థలాల్లో పురుషులు ఆగ్రహం చెందకుండా, వాదనలు పెట్టుకోకుండా తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని నా అభిలాష. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నా ఈ విధంగా ప్రార్థించాలి. స్త్రీలు గౌరవం కలిగించే దుస్తులు ధరించి, వినయంగా, మర్యాదగా ఉండాలి. బంగారు నగలు, ముత్యాలు, ఖరీదైన దుస్తులు, తలవెంట్రుకలతో నానా విధపు ముడులు వేయటం వారికి అలంకారముగా అనుకొనక, దైవభక్తులమని చెప్పుకొనుటకు తగినట్లుగా సత్కార్యములనే ఆభరణాలను అలంకారంగా ధరించాలి.
1 తిమోతికి 2:8-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి ప్రతిచోట పురుషులు పవిత్రమైన చేతులను పైకెత్తి, కోపం లేదా కలహభావం లేకుండా ప్రార్థించాలని నేను కోరుతున్నాను. అలాగే స్త్రీలు నిరాడంబరమైన, క్రమమైన వస్త్రధారణ చేసుకోవాలి, విస్తృతమైన కేశాలంకరణ లేదా బంగారం లేదా ముత్యాలు లేదా ఖరీదైన దుస్తులతో కాకుండ, దేవుని పట్ల భక్తి ఉందని అని చెప్పుకునే దానికి తగినట్లుగా మంచి పనులతో అలంకరించుకోవాలని కోరుతున్నాను.