ద్వితీయోపదేశకాండము 1:30-31
ద్వితీయోపదేశకాండము 1:30-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీకు ముందర నడుచు చున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.
ద్వితీయోపదేశకాండము 1:30-31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీకు ముందుగా నడుస్తున్న మీ దేవుడైన యెహోవా మీ కళ్ళెదుట ఈజిప్టులోను అరణ్యంలోను మీ కోసం చేసినట్లు ఆయన మీ కోసం యుద్ధం చేస్తారు, మీరు ఈ స్థలానికి చేరుకునేవరకు తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మీ మార్గమంతటిలో మిమ్మల్ని ఎలా ఎత్తుకుని వచ్చారో మీరు చూశారు” అని అన్నాను.
ద్వితీయోపదేశకాండము 1:30-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీకు ముందు నడుస్తున్న మీ యెహోవా దేవుడు మీరు చూస్తుండగా ఐగుప్తులో, అరణ్యంలో చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీరు ఇక్కడికి వచ్చేవరకూ దారిలో మీ యెహోవా దేవుడు ఒక తండ్రి తన కొడుకుని ఎత్తుకున్నట్టు మిమ్మల్ని ఎత్తుకుని వచ్చాడని మీకు తెలుసు” అన్నాను.
ద్వితీయోపదేశకాండము 1:30-31 పవిత్ర బైబిల్ (TERV)
మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్లి, మీ పక్షంగా పోరాడుతాడు. ఆయన ఈజిప్టులో చేసినట్టే దీన్నికూడ చేస్తాడు. ఆయన మీకు ముందుగా వెళ్లటం అరణ్యములో మీరు చూశారు. ఒక మనిషి తన కుమారుని మోసినట్లు, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎలా మోసిందీ మీరు చూశారు. ఇంత దూరం ఈ స్థలానికి యెహోవా మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చాడు.’