ద్వితీయోపదేశకాండము 11:20-21
ద్వితీయోపదేశకాండము 11:20-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ ఇంటి ద్వారబంధాల మీద ద్వారాల మీద వాటిని వ్రాయండి, తద్వార యెహోవా మీ పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో మీరు, మీ పిల్లలు ఎక్కువ రోజులు అనగా భూమిపై ఆకాశం ఉన్నంత కాలం మీరు జీవిస్తారు.
ద్వితీయోపదేశకాండము 11:20-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి. ఆ విధంగా చేస్తే యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతివారు జీవించే కాలం భూమిపై ఆకాశం ఉన్నంత కాలం విస్తరిస్తాయి.
ద్వితీయోపదేశకాండము 11:20-21 పవిత్ర బైబిల్ (TERV)
మీ గృహాల ద్వారబంధాల మీద, గవునుల మీద ఈ ఆజ్ఞలు వ్రాయండి. అప్పుడు యెహోవా మీ పూర్వీకులకు యిస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలో మీరూ మీ పిల్లలూ దీర్ఘకాలం జీవిస్తారు. భూమికి ప్తెగా ఆకాశాలు ఉన్నంతవరకు మీరు అక్కడ నివసిస్తారు.
ద్వితీయోపదేశకాండము 11:20-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ యింటి ద్వారబంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను. ఆలాగు చేసినయెడల యెహోవా మీపితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినములును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును.