ద్వితీయోపదేశకాండము 8:3
ద్వితీయోపదేశకాండము 8:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు కాని యెహోవా నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని మీకు నేర్పించడానికి ఆయన మిమ్మల్ని అణచి మీకు ఆకలి కలిగించి మీకు గాని మీ పూర్వికులకు గాని ఇంతకుముందు తెలియని మన్నాతో మిమ్మల్ని పోషించారు.
ద్వితీయోపదేశకాండము 8:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.
ద్వితీయోపదేశకాండము 8:3 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా మిమ్మల్ని అణచి వేసి, ఆకలితో ఉండనిచ్చాడు. తర్వాత మీ పూర్వీకులు ఎన్నడూ చూడని, మీకు యింతకు ముందు తెలియని మన్నాతో మిమ్మల్ని ఆయన పోషించాడు. యెహోవా ఎందుకు ఈ సంగతులు జరిగించాడు? ఎందుకంటే మనుష్యుల్ని ఆహరం మాత్రమే బ్రతికించదు అని మీరు తెలుసుకోవాలని ఆయన కోరాడు గనుక. మనుష్యులు యెహోవా నోటనుండి వచ్చే ప్రతి మాటవలన బద్రుకుతారు.
ద్వితీయోపదేశకాండము 8:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ జేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.
ద్వితీయోపదేశకాండము 8:3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)