నిర్గమకాండము 10:1-2
నిర్గమకాండము 10:1-2 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు. నేనే అతణ్ణి అతని అధికారులని మొండిగా చేస్తాను. నా మహత్తర అద్భుతాలను నేను వాళ్లకు చూపించాలని నేనే ఇలా చేసాను. అలాగే ఈజిప్టులో నేను చేసిన అద్భుతాలు, ఇతర మహత్యాల విషయం మీరుకూడ మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు చెప్పవచ్చని వీటిని చేసాను. అప్పుడు నేనే యెహోవానని మీరంతా తెల్సుకొంటారు” అని చెప్పాడు.
నిర్గమకాండము 10:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మోషేతో “ఫరో దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను చేసిన అద్భుత కార్యాలను వాళ్ళ మధ్య కనపరచాలని నేను అతడి గుండె, అతని సేవకుల గుండెలు బండబారిపోయేలా చేశాను. నేను ఐగుప్తీయుల పట్ల వ్యవహరించిన విధానాన్ని, యెహోవాను నేనేనని మీరు తెలుసుకొనేలా నేను చేస్తున్న అద్భుత కార్యాలను నువ్వు నీ కొడుకులకూ, మనవలకూ తెలియజేయాలి” అని చెప్పాడు.
నిర్గమకాండము 10:1-2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాగా యెహోవా మోషేతో – ఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేనుచేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కనుపరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిననెను.
నిర్గమకాండము 10:1-2 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తర్వాత యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు, ఎందుకంటే నేను అతని హృదయాన్ని అతని అధికారుల హృదయాలను కఠినం చేశాను తద్వార నేను ఈ నా సూచనలను వారి మధ్య ప్రదర్శించవచ్చు, అప్పుడు మీరు మీ పిల్లలకు మనవళ్ళకు నేను ఈజిప్టు వారితో ఎలా కఠినంగా వ్యవహరించానో, వారి మధ్య నా సూచనలను ఎలా కనుపరిచానో చెప్పగలరు, నేను యెహోవానై ఉన్నాను అని మీరు తెలుసుకుంటారు” అన్నారు.